అన్నమయ్య: రాజంపేటలో మర్డర్ మిస్టరీని మన్నూరు పోలీసులు ఛేదించారు. ఈనెల 24వ తేదీ రాజంపేట మండలం ఊటుకూరు సమీపంలోని పంట పొలాల్లో హత్య జరిగింది. మృతురాలు సాకే కళావతి. పడుపు వృత్తి చేస్తూండేదని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో భాగంగా మన్నురు రూరల్ పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు.
నిందితుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంజునాథ గురువిస్. గొంతు నులిమి కళావతిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. డిఎస్పీ శివ భాస్కర్ రెడ్డి. సిఐ పుల్లయ్య,ఎస్సై భక్తవత్సలం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.