సుండుపల్లె మండలంలోని పెదినేని కాలువ గ్రామపంచాయతీ ఈడిగ పల్లెకు చెందిన సుంకర రామకృష్ణయ్య కు చెందిన మామిడి చెట్లు ఈదరగాలుల ప్రభావానికి నేలకొరిగాయి. భారీగా మామిడికాయలు రాలిపోయాయి. ప్రతి ఏడాది మామిడి రైతులకు నష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం నుండి ఎటువంటి నష్టపరిహారం అందకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అయినా ప్రభుత్వ అధికారులు నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపరిహారం వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు. అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో మరి కొంతమంది రైతులకు తీరని నష్టం వాటిల్లిందని రైతన్నలు చెబుతున్నారు.
ప్రజావాణి సమస్యలను అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా.