ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇందుకోసం సుమారు 9000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది అన్నారు ఈ నిధులను విడతల వారీగా అన్ని పాఠశాలల్లో అన్ని సౌకర్యాలకు కల్పించేందుకు వినియోగించడం జరుగుతుందన్నారు రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో కూకట్పల్లి ప్రగతి నగర్ లో ఏర్పాటుచేసిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఆయన ఈరోజు స్థానిక శాసనసభ్యులు వివేకానంద మేయర్ నీలా గోపాల్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మంచి నీటి కోసం కొట్లాడేవారు ప్రస్తుతం జంటనగర్లో ఇంటింటికి మంచినీరు అందుబాటులోకి వచ్చిందన్నారు.
రేపటి తరాల గురించి ఆలోచించే నాయకుడు కేసీఆర్ అన్నారు.మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా 50 రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగ నుందన్నారు. పిల్లలకు మంచి విద్యతోపాటు సామాజిక బాధ్యత ను కూడా ఉపాధ్యాయులు పిల్లలకు సూచించారు ప్రభుత్వ పాఠశాల పిల్లలు బాసర త్రిబుల్ ఐటీ లో సీటు సాధించాలి ప్రైవేటు పాఠశాల విద్యార్థులు దీటుగా పదికి పది మార్కులు తెచ్చుకోవాలన్నారు.