Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జనవరి 22న అయోధ్య ఆలయం ప్రారంభం.

0

వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముడిని ప్రతిష్టించబోతున్నారు. పూజకు హాజరుకావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపారు. దీనిపై ప్రధాని మోదీ నుంచి ఇంకా స్పందన రాలేదు. రామ మందిరాన్ని దర్శించుకోవాలనే కోట్లాది మంది భక్తుల నిరీక్షణకు తెరపడనుంది. రామమందిరంలో శ్రీరాముడి విగ్రహప్రతిష్ట వచ్చే జనవరి 22 జరగనుంది. ఈ సమయంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లోని శ్రీరాముని ఆలయాలను అలంకరిస్తారు. శ్రీరామ జన్మభూమి ఆలయంలో నిర్వహించే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్చువల్గా ప్రదర్శిస్తారు.

 

క్రౌడ్ మేనేజ్ మెంట్ కు సంబంధించి సమగ్ర ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. ఇప్పటి వరకు గర్భగుడి పై భాగంలో పనులు జరుగుతున్నాయి. 2023 అక్టోబర్ నాటికి రామాలయం మొదటి అంతస్తు సిద్ధమవుతుందని, 22 జనవరి 2024న నాటికి ప్రతిష్టకు సిద్ధమవుతున్నట్టు ట్రస్టు నిర్వహకులు తెలిపారు. సుమారు ఏడు రోజుల పాటు ప్రతిష్ఠ  కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత రామ భక్తులను ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తారు. అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి తుది రూపుకు తీసుకొచ్చేందుకు అంతా సిద్ధమవుతోంది.

 

ఎప్పటికప్పుడు ఈ నిర్మాణ పనులపై అప్‌డేట్స్ ఇస్తున్న ట్రస్ట్ ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వెల్లడించింది. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ముహూర్తం ఎప్పుడో చెప్పింది.వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నట్టు ట్రస్ట్‌ ప్రకటించింది. జనవరిలోనే ఆలయ సందర్శనకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే… అప్పటికీ కొంత మేర పనులు మిగిలి ఉంటాయని, భక్తులకు అనుమతినిస్తూనే  ఆ పనులు కొనసాగిస్తామని ట్రస్ట్ వెల్లడించింది.సాలిగ్రామాలతో రాముడు, సీత విగ్రహాలను చెక్కనున్నారు. ఇందుకోసం నేపాల్ నుంచి ప్రత్యేక శిలల్ని తెప్పించారు. గండకి నదీ తీరంలో వీటిని గుర్తించి తీసుకొచ్చారు. ఈ శిలలకు 6 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు భావిస్తున్నారు.

ఎన్డీయే బలపరిచే పనిలో అమిత్ షా.

రాముడి విగ్రహం తయారయ్యాక..స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాణపతిష్ఠ చేయనున్నారు. ఇదే విషయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది. ఇప్పటికీ ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇవి మూడు రెట్లు పెరిగాయి. రాముడి విగ్రహ తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది రామ మందిర ట్రస్ట్. దాదాపు ఆరడుగుల రాముడి విగ్రహాన్ని తయారు చేయించి…వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ప్రతిష్ఠించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే..ఈ విగ్రహ తయారీ కోసం ప్రత్యేక శిలలు తెప్పించింది. నేపాల్ నుంచి రెండు సాలగ్రామ శిలలను తరలించారు.

 

ఇప్పటికే ఇవి అయోధ్యకు చేరుకున్నాయి. రామ మందిర ప్రాంగణానికి చేరుకోగానే పూజారులు, స్థానికులు ఆ శిలలకు ఘనస్వాగతం పలికారు. పూలతో అలంకరించారు. పూజలు చేశారు. ఆ తరవాత ఆ శిలలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అప్పగించారు.రాముడితో పాటు సీతా దేవి విగ్రహాన్నీఈ శిలతోనే తయారు చేస్తున్నారు. గర్భాలయంలో ఈ రెండు విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. నేపాల్‌లోని కలి గండకి నదీ తీరంలో ఈ శిలలను సేకరించారు. వీటిని సీతాజన్మ స్థలిగా భావించే జానక్‌పూర్ నుంచి ప్రత్యేక క్రేన్‌ల ద్వారా అయోధ్యకు తరలించారు. ఈ రెండు సాలగ్రామ శిలల్లో ఒక దాని బరువు 18 టన్నులు కాగా…మరోటి 16 టన్నులు.

 

విగ్రహ తయారీకి ఈ రెండు శిలలు అనువుగా ఉన్నట్టు అధికారులు నిర్ధారించారురాముడి ఆలయంతో పాటు అదే ప్రాంగణంలో మిగతా దేవుళ్ల ఆలయాలూ నిర్మించనున్నారు. ఈ కాంప్లెక్స్‌లో సూర్యాలయం, గణేషుడి ఆలయం, హనుమాన్, అన్నపూర్ణ మాత ఆలయాలు నిర్మించాలని ట్రస్ట్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. పార్క్ వెలుపల అగస్త్య, విశ్వామిత్ర, వశిష్ఠ, మాతా శబరి, జటాయు, అహల్య ఆలయాలు నిర్మించనున్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సుగ్రీవ ఆలయం కూడా నిర్మించాలని నిర్ణయించారు. శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో సుగ్రీవుని ఆలయం కూడా రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే అయోధ్యలో రామాలయ గోపురం కనిపిస్తోంది. స్తంభాలను ఎక్కడికక్కడ పేర్చడం వల్ల ఓ రూపుకు వచ్చింది. మొదటి అంతస్తు ఎత్తు దాదాపు 20 అడుగులుగా ఉండనుంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie