స్వాగతం పలికిన మాధవరావు దేశాయి
నందవరం:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర మంత్రాలయం నియోజకవర్గం ముగించుకొని నందవరం లో అడుగుపెట్టిందో లేదో పాదయాత్ర కాస్త వర్గపోరు మధ్య సాగింది.బివి తో విభేదించి పార్టీ అధికారం లో ఉన్నపుడు పార్టీ ఓడిపోయినపుడు దూరంగా ఉన్న గౌడ్ కుటుంబాని బివి అనూహ్యంగా చేరదీయడంతో మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ మాధవరావు దేశాయి వర్గం జయ నాగేశ్వరరెడ్డి కి దూరమయ్యారు.
స్ధానిక చర్చి దగ్గర నుండి మాధవరావు దేశాయి తన అనుచరులతో భారీ ఎత్తున నారా లోకేష్ కు హారతులు,డ్రమ్స్ ఘన స్వాగతం పలికారు.దేశాయి కుటుంబం,గౌడ్ కుటుంబాల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరి పార్టీకి నష్టం కలగక మునుపే పార్టీ అధిష్టానం సద్ధిమణిగేలా చేయాలని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.