Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

లిక్కర్ స్కామ్ లో… నెక్ట్స్  కవితేనా…

0

హైదరాబాద్, ఫిబ్రవరి 14:ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ పరంపరలో తరువాతి వంతు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వంతేనా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అసలు ఇప్పటి వరకూ జరిగిన అరెస్టులు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్నాయి సౌత్ లాబీలో కీలకమైన వ్యక్తుల్ని సీబీఐ, ఈడీ   అరెస్టు చేసుకుంటూ వెళ్తున్నాయి. అయితే ఇప్పటికే అరెస్టు కావలసిన  అరుణ్ రామచంద్ర పిళ్లై, అప్రూవర్ గా మారబోతున్నరన్న సమాచారం నేపథ్యంలో కవిత చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుందన్న చర్చ జరుగుతోంది.ఎందుకంటే రామచంద్ర పిళ్లై కవిత బినామీగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో చురుకుగా వ్యవహరించారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని చార్జిషీట్ లో కూడా పొందుపరిచాయి. రామచంద్ర పిళ్లై అప్రూవర్ గా మారడం నిజమైన పక్షంలో కవితకు చిక్కులు తప్పవని అంటున్నారు.

ఇప్పటికే కవితను ఒక సారి ప్రశ్నించడం జరిగింది. అప్పుడే మరో సారి విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాల్సి ఉంటుందని చెప్పారు.  గతంలో కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో విచారించారు. అయితే మరో సారి విచారణకు మాత్రం ఆమె సీబీఐ ఎక్కడకు రమ్మంటే అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటి దాకా లిక్కర్ స్కాంలో జరిగిన అరెస్టులను గమనిస్తే విచారణకు పిలిచి, విచారణ అనంతరం చేసినవే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చార్జిషీట్ లో ఈడీ కవిత పేరు ప్రస్తావించింది. దీంతోఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందని చెప్పవచ్చు. ఈ కుంభకోణంలో ఈడీ, సీబీఐల దూకుడు గమనిస్తే కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందనే న్యాయనిపుణులు సైతం అంటున్నారు.  ఈ కుంభకోణంలో ఇప్పటికే కవితకు సన్నిహితులుగా ఉన్నవారిని విచారించి, కొందరిని అరెస్టు చేసిన సీబీఐ కవితను కూడా  ఆమె నివాసంలో సుదీర్ఘంగా విచారించింది.

దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను విచారించిన సీబీఐ.. ఆ విచారణ ముగిసిన అనంతరం ఆమెకు మరో నోటీసు జారీ చేసింది. తొలి నోటీసు సీఆర్పీసీ 160కింద ఇచ్చిన సీబీఐ.. ఆ నోటీసు మేరకు విచారణ పూర్తయిన తరువాత ఇచ్చిన నోటీసు సీఆర్పీసీ 91 కింద ఇచ్చింది. అంటే తొలి నోటీసులో ఆమె వివరణ తీసుకుందుకు మాత్రమే నంటూ ఆమె ఎక్కడ కావాలంటే అక్కడ విచారణ జరుపుతామని పేర్కొన్న సీబీఐ.. ఆమె   ఎంపిక చేసుకున్న విధంగా ఆమె నివాసంలోనే విచారించింది. అయితే రెండవ సారి జారీ చేసిన నోటీసులో మాత్రం ఆమెకు అటువంటి వెసులు బాటు ఇవ్వలేదు. ఈ సారి  సీబీఐ తాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఆమె విచారణ నిమిత్తం వెళ్లాల్సి ఉంటుంది.తొలి నోటీసు మేరకు ఆమె నివాసానికి వెళ్లి దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులు..మలి నోటీసుకు సంబంధించి మాత్రం సమయం, తేదీ, ప్రాంతం తరువాత తెలియజేస్తామని పేర్కొన్నారు.

విచారణకు వచ్చేముందు ధ్వంసం చేసి ఫోన్లు, లిక్కర్ స్కాంకు సంబంధించిన డాక్యుమెంట్లు  అన్నిటినీ తమకు సమర్పించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా పరిగణిస్తారు.  మలి నోటీసు మేరకు కవితను విచారించిన అనంతరం ఆమెను లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా చేర్చే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.  ఇక ఫోన్ల ధ్వంసం సంబంధించిన కచ్చితమైన   నిర్దారణకు వచ్చిన తరువాతనే  సీబీఐ అధికారులు ఆమెను సీఆర్పీసీ 91 కింద నోటీసు జారీ చేశారని భావిస్తున్నారు.సీబీఐ కోరిన మేరకు కవిత ఆ వివరాలన్నీ అందించితే ఒక ఇబ్బంది, అందించకుంటే మరో ఇబ్బంది అన్నట్లుగా ఆమె ఇరుక్కున్నారని న్యాయనిపుణులు అప్పట్లోనే అభిప్రాయపడ్డారు.   ఈ కేసులో ఇప్పటి వరకూ సీబీఐ విచారణ తీరును గమనిస్తున్న వారు కవితను సీబీఐ హస్తినకు పిలిపించుకుని విచారణ జరిపే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie