మహిళల నే కేంద్ర బిందువుగా చేసుకుని పలు కార్యక్రమాలను లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ద్వారా నిర్వహిస్తున్నట్లు లయన్ శ్రీదేవి రెడ్డి పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక రోగులకు నిత్యవసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు గాను కుట్టు శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తూ వందలాది మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
హజరు కాలేను..గడువు ఇవ్వండి సీబీఐని కోరిన అవినాష్ రెడ్డి.
వృద్ధాశ్రమంలో ప్రతినెల 100 కేజీల బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న మహిళలకు ప్రతినెల నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు శ్రీదేవి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాణి, మీనాక్షి ,న్యాయవాది యనమల రామం ,అడబాల రత్న ప్రసాద్, కే. ముని రెడ్డి, రవిశంకర్ పట్నాయక్, రేలంగి బాపిరాజు, రాజా తదితరులు పాల్గొన్నారు