Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రిజర్వాయర్లన్నింటినీ…. టూరిజం కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం

Let's make all the reservoirs into tourism centers

0

టూరిజం కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని రిజర్వాయర్లన్నింటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో మత్తడి పోస్తున్న రిజర్వాయర్ ను సందర్శించి గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం సీనియర్ నాయకుడు చింతకుంట్ల నరేందర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు ఏడాదిలో కురిసే వర్షాలతో సమానం అన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైందన్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిన బాధితులకు ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు తోడ్పాటును అందించాలని ఆయన కోరారు.

వర్షాలతో దెబ్బతిన్న మారుమూల పల్లెలు, గ్రామాలను బాహ్య ప్రపంచానికి తీసుకువచ్చిన మీడియాను అభినందించారు. నియోజకవర్గ కేంద్రంలోని రిజర్వాయర్ కట్టపై తుమ్మ చెట్లు పెరిగి మత్తడిని చూసేందుకు వెళ్లే పర్యాటకులకు తీవ్ర అంతరాయం కలగడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రిజర్వాయర్ కట్టకు ఉన్న చెట్లను తొలగించాలని సందర్శకులు మత్తడిని చూసేందుకు అవకాశం కల్పించాలని అధికారులను కోరారు. మున్సిపాలిటీగా మారనున్న స్టేషన్ ఘన్ పూర్ కు రిజర్వాయర్ పర్యాటక కేంద్రం గా మార్చితే ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు. నియోజకవర్గంలోని రిజర్వాయర్లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు తయారుచేసి ముఖ్యమంత్రికి నివేదిస్తానన్నారు. మత్తడిపై వంతెన, రిజర్వాయర్ పై లైటింగ్, పూల తోటల ఏర్పాటుతో సుందరీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో బెలిదే వెంకన్న, మామిడాల లింగారెడ్డి, బూర్ల శంకర్, పోగుల సారంగపాణి, రాజేష్ నాయక్, స్వామి నాయక్, ఎల్మకంటి నాగరాజు, జనగామ యాదగిరి, రాపోలు మధుసూదన్ రెడ్డి, పెసర సారయ్య, జీడి ప్రసాద్, బాస్ కుల కుమార్, మంద రాజు, పల్లె రవి, పొగాకు సోమన్న, అయోధ్య, యాకుపాషా వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie