Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ప్రజా వ్యతిరేక పాలన అంతం చేద్దాం

0

హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో  జువ్వాడి కృష్ణారావు
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను అంతం చేద్దామని టిపిసిసి నేత జువ్వాడి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీని నాయకులకు పిలుపు నిచ్చారు.. సోమవారం
పట్టణంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేత జువ్వాడి కృష్ణారావు హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ప్రారంభించారు..ఈ సందర్భంగా పట్టణంలోని భీముని దుబ్బ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ తిరుమల వసంత – గంగాధర్ తో కలిసి వార్డులో పాదయాత్ర చేస్తూ, గడపగడపకు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబలుస్తున్న తీరు గురించి ప్రజలకు వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా సోమవారం నుండి రాష్ట్రంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జోడో యాత్రను మొదలు పెడుతున్నారని వారి యాత్రకు మద్దతుగా సోమవారం కోరుట్ల పట్టణంలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని మొదలుపెట్టామన్నారు.

భారతదేశంలో ప్రజలు పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలు జీవనం సాగించడం చాలా కష్టంగా మారిందన్నారు. నిత్యవసరాల ధరలు పెంచుకుంటూ పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిలిండర్ ధర కేవలం 400 రూపాయలు ఉండేదని ఇప్పుడు 1150 రూపాయలు చేశారన్నారు.. గతంలో సిలిండర్ ని సబ్సిడీ డబ్బులు వచ్చేవి కానీ ఇప్పుడు సబ్సిడీని కూడా కేంద్ర ప్రభుత్వం తీసివేసిందన్నారు. బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్నారు ..అదేవిధంగా మోదీ అనాలోచిత నల్ల వ్యవసాయ చట్టాల వల్ల 700 మంది రైతులు మరణించారన్నారు.. మోడీ ప్రభుత్వంలో వారి మిత్రులు తీసుకున్న 72 వేల కోట్ల రుణమాఫీ చేశారు .కానీ ఒక రైతుకు రుణమాఫీ కూడా చేయలేదని జువ్వాడి కృష్ణారావు అన్నారు.

అదే విధంగా రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో కేజీ టూ పేజీ ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, దళిత గిరిజన కుటుంబాలకు మూడెకరాల భూమి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హామీలను కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పే కెసిఆర్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నిధులు లేవని ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరున కెసిఆర్ కుటుంబం అధికంగా దోచుకున్నారన్నారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ పైన 1.52 లక్షల అప్పుబారం ఉందని జువ్వాడి కృష్ణారావు తెలియజేశారు.. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త గడపగడపకు తిరిగి ప్రజలకు అన్ని వివరించాలని కోరారు. సోమవారం మొదలైన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్రను  రాష్ట్రంలో నాయకులందరూ విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ ,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి తుపాకుల బాజన్న, కార్యదర్శులు మ్యాకల నర్సయ్య ,దండవేణి వెంకట్, సహాయ కార్యదర్శులు ఎంబేరి సత్యనారాయణ ,చిటిమెల్లి రంజిత్ గుప్త ,పట్టణ కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీరాముల అమర్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్ ,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పన్నాల అంజిరెడ్డి లముక్కెర రాజేష్ , చిలువేరి విజయ్, గంగాధారి ,శ్రీను ,ముజిబిత్ బారి ,జాగిలం ,భాస్కర్ ,వాసం అజయ్, మొహ్మద్ నసీర్, వార్డు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie