ఏపీలోని చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో చిరుత మృతి కలకలం రేపుతుంది . జిల్లాలోని కర్ణలపట్టు అటవీ ప్రాంతంలో పశువుల కాపరులు చిరుత కళేబరాన్ని చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పంచనామా జరిపి కేసు నమోదు చేశారు. వారం రోజుల క్రితమే చిరుత చనిపోయిందని వారు వెల్లడించారు.
వేటగాళ్ల దాడిలో చిరుత మరణించిందని వారు అనుమానం వ్యక్తం చేశారు. కాగా వి కోట మండలంలో మరో చిరుత గ్రామంలోని పశువులపై దాడి చేసింది . స్థానికులు అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోకి పారిపోయింది . చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.