మెదక్, జూలై 15: తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయ్.. ఇంకేముంది పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటినుంచే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయ్.. ఎన్నికలకు ఇంకా చాలా సమయముంది.. కానీ.. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని యువతను ఆకర్షించే పనిలో పడ్డాయట బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు.. ఇప్పటి నుండే నియోజకవర్గ పరిధిలో ఉన్న యువతీ, యువకులకు గాలం వేస్తున్నారు..
ఉచిత డ్రైవింగ్ లైసెన్స్
ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఉన్న యువతీ, యువకులు ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారట.. ఎందుకో తెలుసా..? ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కోసం.. అవును మీరు విన్నది నిజమే ప్రస్తుతం దుబ్బక నియోజకవర్గ పరిధిలో ఇదే ఇంట్రస్ట్ టాపిక్ అయ్యింది. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ లను ఇప్పిస్తున్నారు అక్కడి ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ఎంపీ కొత్త ప్రభకర్ రెడ్డి..మొదట ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రకటించారు. 18 ఏళ్ళు నిండిన టూవీలర్ లైసెన్స్ కోసం తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. దీంతో నియోజకవర్గ పరిధిలోని యువతీ, యువకులు పెద్ద ఎత్తున్న ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కి తరలివచ్చారు.
ఇది గమనించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా యువతకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలని ఫిక్స్ అయ్యారట.. మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభకర్ రెడ్డిది కూడా ఇదే నియోజకవర్గం కావడం.. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి పోటీలో ఉండాలని అనుకుంటున్న నేపథ్యంలో.. ఎంపీ కొత్త ప్రభకర్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి టూ వీలర్ లైసెన్స్ తో పాటు, ఫోర్ వీలర్ లైసెన్స్, దీనితో పాటు ఒక హెల్మెట్ కూడా ఇస్తాం అని ప్రకటించేశారు..ఇంకేముంది.. దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఉచిత లైసెన్స్ సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం టూ వీలర్ లెర్నింగ్ లైసెన్స్ కు 300 రూపాయలు.. పర్మినెంట్ లైసెన్స్ కి 750 రూపాయలు ప్రభుత్వ ఫీజు ఉంది. అలాగే టూ&ఫోర్ వీలర్ లెర్నింగ్ లైసెన్స్ కు 450 రూపాయలు. పర్మినెంట్ లైసెన్స్ కి 1400 రూపాయల ఫీజు ఉంది. కాగా వీటికి అయ్యే ఖర్చును మొత్తం ఎమ్మెల్యే, ఎంపీనే చెల్లిస్తున్న నేపథ్యంలో యువత కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి అప్లికేషన్లు ఇస్తున్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు Dubbaka MLA Raghunandan Rao
ఇప్పటివరకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కార్యాలయానికి 12 వేల దరఖాస్తులు రాగా, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యాలయానికి 13,411 దరఖాస్తులు వచ్చాయిదుబ్బాక నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఈ Free driving license fair ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను చూసిపక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు,ఇతర నేతలు కూడా ఇదే బాటలో వెళ్లాలని ఫిక్స్ అయ్యారట.. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కూడా తన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని యువతీ, యువకులకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను ప్రారంభించారు..అక్కడ కూడా ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు యువత భారీగానే తరలివచ్చారు.. మరోవైపు రెండు రోజుల్లో సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర హ్యాండ్లూమ్ సంస్థ చైర్మన్ కూడా దీని ప్రారంభిస్తానని చెప్పారు. ఇలా పోను, పోను ఈ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా ఉమ్మడి మెదక్ జిల్లా అంత వ్యాపించే అవకాశం ఉందని రాజకీయ నేతలు పేర్కొంటున్నారు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్ష నేతలు తమకు అందిస్తున్న ఈ ఆఫర్లు చూసి యువత కూడా మురిసిపోతోంది.. ఇప్పుడే ఇలా ఉందంటే.. భవిష్యత్తులో ఇంకెన్ని ఆఫర్లో అంటూ యువతీయువకులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Courtesy: NewsPulse