Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మొరాయిస్తున్న సర్వర్లు.. జనాల ఇబ్బందులు.

0

రాష్ట్ర వ్యాప్తంగా భూ రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ల డౌన్ తో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరో రెండ్రోజుల్లో భూముల విలువ పెరుగుతుండటంతో ప్రజలు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్యూకట్టారు.ఏపీలో  ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడింది. జూన్ 1 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద రద్దీ పెరిగింది. అయితే సర్వర్లు మొరాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో జనం ఆఫీసుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరో రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుతో పెద్ద ఎత్తున భూలావాదేవీలు జరిపిన వారు రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీసులకు క్యూకట్టారు. సర్వర్లు పని చేయకపోవడంతో దస్తావేజులను రిజిస్ట్రేషన్లు చేయడం ఆలస్యం అవుతుందని అధికారులు అంటున్నారు.

 

అయితే రిజిస్ట్రేషన్ ధరల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పలువురు కోరుతున్నారు. నాలుగు రోజుల క్రితం చలానా కట్టినా సర్వర్ డౌన్ తో రిజిస్ట్రేషన్ కాలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇలా ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపడం సరికాదని అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దని, నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.గూడూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సర్వర్లు మొరాయించడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్ పరిధిలోని గ్రామాల ప్రజలు భూములు అమ్మకం, కొనుగోలు రిజిస్ట్రర్‌లతో పాటు ఈసీలు, నకళ్ల కోసం గూడూరుకు తరలివచ్చారు. అయితే సర్వర్లు మొరాయించడంతో ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోయి క్రయ, విక్రయాల రిజిస్ట్రర్లు జరగకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

 

ఆన్‌లైన్‌ ఈసీలు రాక రిజిస్ట్రేషన్ కాకపోవడం, సబ్‌ రిజిస్ట్రర్‌ కార్యాలయంలోనే ఆన్‌లైన్‌ సర్వర్లు మొరాయించడంతో రిజిస్ట్రేషన్లు కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఆన్‌ లైన్‌ సేవలు సక్రమంగా పనిచేసేలా చూడాలని ప్రజలు వేడుకుంటున్నారు. చలానాలు పెంచడంతో సామాన్యులపై అధిక భారం పడుతుందంటున్నారు. రిజిస్ట్రేషన్ ధరల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఏపీలో జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ సీఎం జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్ లో ఉన్నాయి. జూన్1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. నేడు సర్వర్లు అందుబాటులోకి రావడం కష్టమే అని అధికారులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి.

 

చలానాల ధర పెరగడంతో తమపై అధిక భారం పడుతుందని భావించి జనం తమ భూముల క్రయ విక్రయాలు త్వరగా చేసుకోవాలని భావిస్తున్నారు. సర్వర్ల మొరాయింపుతో రేపటి నుంచి మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం. సర్వర్లు మొరాయించడంతో సోమవారం ఉదయం నుంచి భూముల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. 2010కి ముందు రాష్ట్రంలో మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహించేది.
రేట్లు పెరిగిది ఇలా భూముల మార్కెట్ విలువ పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విశాఖ లాంటి నగరాల్లో భూముల రేట్లు అమాంతం పెరగనున్నాయి.

 

స్పెషల్ రివిజన్ పేరుతో విలువ పెంపు చేయనున్నారు. పెరిగిన చార్జీలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సర్వర్లు మొరాయిస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. భూముల మార్కెట్ విలువ పెంచాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రద్దీ పెరుగుతోంది. రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో భూములకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. కొత్త జిల్లా కేంద్రాల్లో భూముల రేట్లపై ప్రభావం పడనుంది.
ధరలు పెరిగే ప్రాంతాలు:విశాఖ, గాజువాక, ద్వారకానగర్, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి, ఆనందపురం, మధురవాడ. భూమి విలువ పెంపు ఇలా:డిమాండ్ ఉన్న చోట 60 శాతం, మధ్యస్థంగా ఉన్నచోట 40 శాతం, తక్కువ ఉన్న చోట 30 శాతం మేర భూముల రేట్లు పెంచనున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie