గోదావరిఖని లక్ష్మీనగర్ లోని అంబికా హాస్పిటల్ మెడికల్ షాప్ నిర్వాహకుడు కొండ సంపత్ ఆయన భార్య రమాదేవి తమ పెళ్లి రోజును పురస్కరించుకుని, మరణాంతరం తమ నేత్రాలను దానం చేస్తామని ముందుకు వచ్చారు. సదాశయ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు రాజమౌళి, ప్రతినిధి కే.ఎస్.వాసు ఆధ్వర్యంలో సోమవారం హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సంపత్ కు, హాస్పిటల్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ చేతుల మీదుగా సదాశయ ఫౌండేషన్ అభినందన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. నేత్రదానం చేయడానికి తన హాస్పిటల్ సిబ్బంది .
జగన్ తీరుపై మండిపడ్డ పవన్ కళ్యాణ్.
సంపత్ ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ప్రజలు మరణానంతరం నేత్ర, అవయవ, శరీర దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సదాశయ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అభినందించారు. దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నిర్వహణ ఇంచార్జీ వేణుగోపాల్ తోపాటు సిబ్బంది సురేష్, సాగర్, శ్రావణ్, అబ్జల్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంపత్ దంపతులను సదాశయ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రావణ్ కుమార్, లింగమూర్తి, ప్రతినిధులు భీష్మాచారి, చంద్రమౌళి, బెణిగోపాల్ త్రివేది తదితరులు అభినందించారు.