- తరలివస్తున్న దీక్షపరులు..
- అంజన్న క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ…
మల్యాల: ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.. మంగళవారం కొండగట్టులో చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.. ఈ సందర్బంగా స్వామివారిని దర్శించుకోవడానికి సోమవారం రాత్రి నుంచే కొండపైకి భక్తుల తాకిడి మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు, దీక్షపరులు తరలివచ్చారు. కోనేరులో స్నానమాచరించిన అనంతరం అంజన్నను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు స్వాములు ఇరుముడిలతో కొండపైకి చేరుకొని, స్వామివారికి ముడుపులు సమర్పించారు. తెల్లవారుజామున, రాత్రి సమయంలో కళ్యాణకట్ట, మాల విరమణ మండపం, ప్రసాదం, ప్రత్యేక దర్శనం కౌంటర్ల వద్ద భక్తుల రద్దీ కొనసాగింది. ఇక పొతే, అంజన్న దర్శనంకు గంటల సమయం పట్టింది.
మూడు రోజుల పాటు ఉత్సవాలు..
కొండగట్టులో చిన్న జయంతి ఉత్సవాలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి.. మొదటి రోజు మంగళవారం దాదాపు వరకు భక్తులు అంజన్నను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. రెండో రోజు బుధవారం భక్తుల రాక ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఆలయంలో అర్జీత సేవలు నిలిపివేశారు. తిరిగి ఉత్సవాల ముగింపు అనంతరం సేవలు కొనసాగించనున్నట్లు అర్చకులు తెలిపారు.
మొదటిరోజే చుక్కలు..
జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదేశాలను అధికారులు భేఖాతర్ చేశారు. చిన్న జయంతి ముందు రోజే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడడం కొట్టచ్చినట్టు కనబడింది. జయంతికి తోడు అందులో మంగళవారం కావడం వల్ల భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముక్యంగా తెల్లవారుజామునుంచి, ఉదయం 8 గంటల వరకు రద్దీ విపరీతంగా కొనసాగింది. అధికారులు, పోలీసులు ఎక్కడకూడా కనిపించలేదు. త్రాగునీటికి భక్తులు ఇబ్బందులు పడ్డారు. 50 ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన ఆలయ అధికారులు కనీసం 10 కూడా ఏర్పాటు చేయకపోవడం విశేషం. కోనేరులో భక్తులు మురికి నీటీలోనే స్నానమాచరించారు.
ఇకపోతే, వాహనాలు భారీ సంఖ్యలో కొండపైకి చేరుకోవడంతో ఘాట్ రోడ్డు, y జంక్షన్ వద్ద తెల్లవారుజామున పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఎవరికీ వారే ట్రాఫిక్ క్లియర్ చేసుకోవడం కనిపించింది. కాగా, ఘాట్ రోడ్డుపై ఎత్తయిన వాహనాలు వెళ్లకుండా ఏర్పాటు చేసిన హైట్ కంట్రోల్ (ఇనుప గేట్)ను ఓ వాహనం ఢీ కొట్టడంతో అది వంగింది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పి, పట్టించుకోకపోవడంతోనే భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉత్సవాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయం, కొండపై, కింద విద్యుత్ దీపాలతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశించినప్పటికీ, మంగళవారం అవేమి ఏర్పాట్లు కనిపించకపోవడం గమనార్హం.