Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

భార్యను చంపి… గుండెపోటుగా చిత్రీకరణ

congress leader son killed his wife

0

నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత రంగసాయి రెడ్డి కుమారుడు వల్లభ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభ్ రెడ్డి ఆయన భార్య లహరిని హత్య చేసిన కేసులో.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక లహరి మృతి కేసు దర్యాప్తు సంచలనంగా మారింది. లహరి మృతిని వల్లభ్ రెడ్డి గుండెపోటుగా చిత్రీకరించిన పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు గుర్తించారు. లహరి రెడ్డి తలను గోడకు, తలుపుకు గట్టిగా బాది పొట్టలో కాలుతో వల్లభ్ రెడ్డి బలంగా తన్నడంతో మృతి చెందినట్లు పోలీసులు వివరిస్తున్నారు. నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు రంగసాయి రెడ్డి కుమారుడు వల్లబ్ రెడ్డి (30) అతని భార్య లహరి(27) హిమాయత్ నగర్లో నివాసం ఉంటున్నారు.

కొంత కాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరి పెళ్లి జరిగి ఏడాది కాగా ఈ నెల 13వ తేదీన రాత్రి వల్లభ్ రెడ్డి లహరిని తీవ్రంగా కొట్టాకు. ఆమె తలను గోడకు, తలుపుకు బాదారు. అనంతరం లహరి పొట్టలో కాలుతో బలంగా తన్నడంతో పొట్టలో రెండున్నర లీటర్ల బ్లడ్ బ్లీడింగ్ జరిగింది. అయితే భార్య చనిపోయిన గుర్తించిన అతడు.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు హార్ట్ ఎటాక్ పేరుతో ఆస్పత్రిలో అడ్మిట్ చేశాడు. గుండె పోటుతో చనిపోయినట్లుగా అందరిని నమ్మించారు.

అంత్యక్రియలు కూడా జరిపించేశారు. ఇదే నెల 24న భార్య దినకర్మకు జరిపించారు. ఆరోజు 10వేల మందికి భోజనాలు పెట్టి వల్లభ్ రెడ్డి తనకు ఏమీ తెలియనట్లు నటించాడు. అయితే పోస్టుమార్టం నివేదికలు అసలు విషయం బయటపడింది.వల్లబ్ కొట్టడంతోనే లహరి చనిపోయినట్లు పోలీసులు తేల్చారు. లహరి తలపై గాయాలు ఉన్నట్లు కనిపిస్తున్నా ఆమె తల్లితండ్రులు అనుమానం వ్యక్తం చేయలేదు. అయితే లహరి తల్లితండ్రులను వల్లభ్ బెదిరించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie