విశాఖలో వైసీపీ ఎంపీ భార్యాపిల్లల కిడ్నాప్ కలకలం రేపింది. ప్రముఖ ఆడిటర్, మాజీ స్మార్ట్ సిటి చైర్మన్ జీవీతో పాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు చందు, భార్య జ్యోతి కిడ్నాప్ అయ్యారు. ఈ విషయం క్షణాల్లో మీడియాలో వైరల్ అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు క్షణాల్లో ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ ఆచూకీని కనుగొన్నారు. కిడ్నాపైన ముగ్గురూ క్షేమంగా ఉన్నారని ఎంపీ తెలిపారు. విశాఖ-ఏలూరు రోడ్డులో ఎంపీ భార్య, కుమారుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు.కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కిడ్నాప్‌నకు ముగ్గురు వ్యక్తులు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ముగ్గురిలో రౌడీషీటర్ హేమంత్ కీలకంగా వ్యవహరించినట్టు తెలిపారు.
హేమంత్‌పై గతంలో పలు కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ వీజారెడ్డిని హత్య చేసిన కేసులో హేమంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కిడ్నాప్ అనంతరం రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఎంవీవీ విషయం తెలియగానే హుటాహుటిన వైజాగ్‌కు బయలుదేరారు.ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే కిడ్నాపర్లలో ఒకరైన హేమంత్ కు నేర చిట్టా ఉంది. రియల్టర్ ను కిడ్నాప్ చేసిన కేసులో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో హేమంత్ అరెస్ట్ చేశారు. వైసీపీ ఎంపీ, భార్య కిడ్నాప్ కేసులో కూడా మూలాలు రియల్ ఎస్టేట్ తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడి వివాహం ఇటీవలే జరిగింది తనకంటూ ప్రైవసీ కావాలనే ఉద్దేశంతో ఓ పెద్ద ఇల్లు నిర్మాణం చేపట్టి కుమారుడికి గిఫ్టుగా ఇచ్చాడు ఎంపీ. అనతి కాలంలోనే వ్యాపారంలో అగ్రస్థానంలో నిలిచిన ఆ పార్లమెంటు సభ్యుడు కుమారుడ్ని కిడ్నాప్ చేస్తే ఇంకేముంది మనం అడిగిందంతా ఇస్తారు ఇక మన సినిమా మారిపోతుందనుకున్నాడు కిడ్నాపర్ హేమంత్. కానీ చివరికి డామిట్ కథ అడ్డం తిరిగింది అనుకోవాల్సి వచ్చింది. ఎంపీ కుమారుడు .. విడిగా ఉంటున్నారని తెలుసుకున్న హేమంత్.. ఆలస్యం చేయకుండా గత కొద్ది రోజులుగా ఎంపీ కుమారుడు నివసిస్తున్న ప్రాంతంలో రెక్కీ నిర్వహించాడు.
ఆ ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడన్న విషయాన్ని తెలుసు కున్న కిడ్నాపర్ ముందుగా ఎంపీ కొడుకు కిడ్నాప్ చేసేందుకు సిద్ధం అయిపోయాడు ఈ కిడ్నాప్ లో పోలీసుల ఊహకందని విధంగా ఎవరినైతే కిడ్నాప్ చేశారా వారింట్లో పై 48 గంటలు కిడ్నాపర్ వాళ్లతో పాటు ఉన్నాడు. నిత్యం పర్యాటకులు అదే రోడ్లో తిరిగే అందమైన సముద్రానికి అతి దగ్గరలో ఎంపీ కుమారుడు శరత్ ఇల్లు ఉంది. ఇంట్లో శరత్ ఒక్కడే ఉన్నాడని గ్రహించిన కిడ్నా పర్లు మంగళవారం ఉదయమే ఆ ఇంట్లోకి ప్రవేశించారు. శరత్ ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఫోన్లలో ఇతరులకు అందుబాటులో ఉండేలా చూశారు.
ఒక్కడినే కిడ్నాప్ చేస్తే మనము డిమాండ్ చేసిన డబ్బు ఎంపీ ఇవ్వడేమో అనే అనుమానం తో ఎంపీ భార్య జ్యోతిని కూడా కిడ్నాప్ చేసేందుకు మరో ఎత్తుగడ వేశాడు. ఎంతో చాకచక్యంగా కొడుకుతోనే తల్లిని అదే ఇంట్లోకి పిలిపించుకున్నాడు. తల్లి జ్యోతి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆమెను కూడా నిర్బంధించారు. ఆమెకి వస్తున్న ఫోన్లు కూడా మాట్లాడించే అవకాశాన్ని కల్పించారు ఎ వరికీ అనుమానం రాకుండా గత రెండు రోజులుగా ఎప్పుడు మాదిరిగానే ఎంపీ ఎంవీవి సత్యనారాయణ కొడుకు శరత్, భార్య జ్యోతి తో ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నారు . అయితే బుధవారం జీవికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎంపీ సత్యనారాయణకు అనుమానం వచ్చింది.
కనీసం తర్వాత అయినా రిప్లై ఇస్తారు కదా ఇవ్వలేదు ఏంటి అని ఆలోచనలో పడ్డ ఎంవివి సత్య నారాయణ అదే తడువుగా పోలీసు లకు ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు జీవి ఫోన్ ట్రాక్ చేశారు అప్పటికే భీమిలి మండలంలో ఉన్నట్లు కనుక్కున్నారు. ఇక సిపి త్రివిక్రవర్మ ఆదేశాలతో ముగ్గురు డిసిపిలు 15 టీములుగా విశాఖలో జల్లెడ పట్టారు. వారు పయనిస్తున్న కారును వెంబడించి ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఎంవివి భార్య కొడుకును జీవిని సురక్షితంగా విశాఖ తీసు కొచ్చారు .
వీరితో పాటు నిందితులను కూడా విశాఖ కమిషనరేట్ కు తరలించారు . కిడ్నాపర్లు ఎంవివి సత్యనారాయణ కుమారుడు శరత్ కు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.అధికార పార్టీ ఎంపీ కుటుంబానికే రక్షణ లేకుంటే సామాన్యులకు రక్షణ ఎక్కడ అని పలువురు చర్చించుకుంటున్నారు. తొలుత కిడ్నాప్ వ్యవహారం రహస్యంగా ఉంచిన పోలీసులు కిడ్నాప్ వార్త వైరల్ అవడంతో సినిమాల్లో పోలీసులు లేట్ గా ఎంట్రీ ఇచ్చినట్టు ఉంది విశాఖ కిడ్నాప్ వ్యవహారం.