కరీంనగర్ : కరీంనగర్ కు చేరుకున్న కిడ్నాప్ అయిన ఇద్దరు పిల్లలు. స్థానిక మంకమ్మ తోటలో రెండు రోజుల క్రితం చాక్లెట్లు కొనిస్తానని చెప్పి అక్షిత(11) లోకేష్(09)లను జయశ్రీ అనే మహిళ అనే కిడ్నాప్ చేసింది వీరిని మహారాష్ట్ర కు తరలించినట్లు తెలిసింది. జాల్నా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై పిల్లలను కొట్టింది. అనుమానం వచ్చిన రైల్వే పోలీసులు పిల్లలను అదుపులోకి తీసుకున్నారు.
పిల్లల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పిల్లల సమాచారాన్ని తెలిపారు. అక్కడి నుండి కరీంనగర్ పోలీసులకు సమాచారం అందించి వెంటనే కరీంనగర్ కు ఇద్దరు పిల్లలని తీసుకువచ్చారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు తీసుకున్న చర్యలపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.