తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం
హైదరాబాద్ ఏప్రిల్ 27: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకున్నారు.
కాగా ఎన్నికలపై సీఎం కేసీఆర్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలన్నారు. లేకపోతే నష్టపోతారని, సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. కాగా ముందుగా కే కేశవరావు ప్రసంగంతో సమావేశం ప్రారంభమైంది. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటిఆర్ తీర్మానాలను ప్రవేశ పెట్టారు.
తీర్మానాలు ఇవే..
— దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బిఆర్ఎస్ ఉద్యమ స్పూర్తితో పురోగమించాలని కోరుతూ తీర్మానం..
– దేశానికి సాగునీటి విధానం రూపొందించాలి…
– వ్యవసాయానికి పెట్టుబడి సాయం దేశ వ్యాప్తంగా అమలు చేయాలని..
– భారత ప్రజలను ఏకం చేసి బలీయమైన రాజకీయ శక్తిగా బిఆర్ఎస్ ముందుకు వెళ్లాలని..
– బీఆర్ఎస్ నేతృత్వంలో దేశ అవసరాలకు సమగ్ర సాగునీటి విధానం రూపొందించాలని..
– తెలంగాణలో వున్న రైతు రాజ్యం దేశం అంతటా స్థాపించాలని..ఇందుకోసం అలుపెరుగని పోరాటం దిశగా బిఆర్ఎస్ ముందుకు వెళ్ళాలని..
– కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను తుదముట్టించేందుకు బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మించాలని..
– నూతన విద్యుత్ విధానాన్ని బీఆర్ఎస్ అమల్లోకి తీసుకురావాలని…
– దళిత బంధు పధకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని..
– దేశంలో మౌళిక వసతుల కల్పన చేయాలని…
– కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని…
– మతోన్మాద శక్తుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సమావేశంలో తీర్మానాలు చేశారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సీరియస్ వార్నింగ్
కాగా ఎన్నికలపై సీఎం కేసీఆర్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలన్నారు. లేకపోతే నష్టపోతారని, సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. కాగా ముందుగా కే కేశవరావు ప్రసంగంతో సమావేశం ప్రారంభమైంది. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటిఆర్ తీర్మానాలను ప్రవేశ పెట్టారు.