- అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం
- బిఆర్ఎస్ ఇంచార్జి వెంకటశ్వర్లు
తూప్రాన్: దేశంలోనే ఆదర్శ నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని బిఆర్ఎస్ ఇంచార్జి బోడుకంటి వెంకటశ్వర్లు అన్నారు. మంగళవారం తూప్రాన్ మండల పరిధిలోని ఘనపూర్ శివారులో బిఆర్ఎస్ అధ్యక్షులు బాబుల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు ఎలక్షన్ రెడ్డి, భూంరెడ్డితో కలిసి పాల్గొన్నారు.
కెసిఆర్ చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు మోసలి కన్నీరు కారుస్తున్నాయని, ఎన్ని కుట్రలు చేసినా మూడవ సారి ఆఖండ మెజారిటీతో బిఆర్ఎస్ విజయం సాదిస్తుందని అన్నారు. మొదటినుండి పార్టీలో ఉన్న కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని భూంరెడ్డి అన్నారు. గజ్వెల్ కు సమానంగా తూప్రాన్ ను అభివృద్ధి చేయాలని ఎలక్షన్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ స్వప్న వెంకటేష్, పాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు భగవాన్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ, పురంరవి, ఆంజనేయులు గౌడ్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.