7 వివి రావుపేట ఐకెపి సెంటర్ సందర్శించిన కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల
జిల్లా లోని మల్లాపూర్ మండలం వివి రావుపేట గ్రామంలోని ఐకేపీ సెంటర్ ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు సందర్శించారు.. ఈ సందర్బంగా రైతులతో మాట్లాడి తలెత్తుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు… ఆనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ రైతులు ఎంతో శ్రమించి కష్టపడి పండించిన పంటను ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని అమ్మడానికి తీసుకువస్తే కళ్ళల్లో కూడా అరీగోస పడుతున్న రైతుల ఇబ్బందులను చూసి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగిందన్నారు… కొనుగోళ్ళలో జాప్యం, తాలు తప్ప,అధిక తూకం,కటింగ్ ఇంకా ఎన్నో రకాలుగా కొర్రీలు లేకుండా రైతులను ఇబ్బందులు పెట్టకుండా కొనుగోళ్లు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తరపున రైతుల పక్షాన జువ్వాడి కృష్ణా రావు డిమాండ్ చేశారు.
.కొనుగోలు చేసిన ధాన్యం తరలింపులో ఆలస్యం అవుతుందని తెలపడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి లారీలు తొందరగా పంపాలని కోరారు.. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన కాసర్ల రమేష్, ఏక్సిడెంట్ లో మరణించిన కాంగ్రెస్ నాయకులు కలాలి నర్సయ్య, బదానపల్లి గంగారాజం కుటుంబ సభ్యులను జువ్వాడి కృష్ణారావు పరామర్శించి మనో దైర్యం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు పెరుమాండ్ల సత్య నారాయణ గౌడ్,కాంగ్రెస్ నాయకులు మిట్టపల్లి జలపతి రెడ్డి, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ జాయింట్ సెక్రటరి బాజోజి సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ మల్లాపూర్ మండలం అధ్యక్షులు పోతు శేఖర్, మక్కాల శ్రీహరి,అచ్చా శ్రీను, బియ్యం నారాయణ
,భూక్యా గణేష్,గుగ్లవత్ మహేష్,తదితరులు పాల్గొన్నారు…