ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
Justice Dheeraj Singh Thakur as the Chief Justice of AP High Court
- ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- పాల్గోన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేసారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ పాల్గోన్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ అభిమానులకు BRO MOVIE ఫుల్ మీల్స్
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, శాసనమండలి డిప్యూటీ చైర్మ్న్ జకియా ఖానమ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్రెడ్డి, పలువులు న్యాయమూర్తులు, ఉపముఖ్యమంత్రి (పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, హోంశాఖ మంత్రి తానేటి వనిత, జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ఇతర ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, ఉన్నతాధికారులు హజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కి సిఎం వైఎస్.జగన్ కి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.