Amaravati Contractor అమరావతి కాంట్రాక్టర్ లు అయిన షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు 118 కోట్ల ముడుపులు ముట్టాయి. ఈ క్రమంలో.. షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు సమాచారం. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు ఆదాయ పన్ను శాఖ అధికారులు.
మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి) ఒప్పుకున్నారు కూడా. చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగష్టు 4వ తేదీనే హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సంస్థల నుంచి వచ్చిన ₹118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించడం, చట్టం ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను నోటీసుల్లో ప్రస్తావించింది ఐటీ శాఖ.
షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు ముట్టాయి. ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగినట్లు తేలింది. 2016లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా టచ్లోకి వెళ్లాడు మనోజ్ వాసుదేవ్. శ్రీనివాస్ ద్వారానే సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు అందుకున్నారు.