Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పటాన్‌చెరు వరకు మెట్రో విస్తరిస్తాం.. తొలి సమావేశంలోనే ఆమోదం’. సీఎం కేసీఆర్‌ ప్రకటన..

0

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పటాన్‌చెరులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కొల్లూరులో 128 ఎకరాల్లో నిర్మించిన 15,600 డబుల్బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం పటాన్చెరు పట్టణంలో సుమారు రూ.184 కోట్లతో 200 బెడ్‌ల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం పటాన్‌చెరు వాసులకు శుభవార్త తెలిపారు. భవిష్యత్తులో పటాన్‌చెరు వరకు విస్తరిస్తామని హామీ ఇచ్చారు.ఈ విషయమై కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘పటాన్‌చెరు వరకు మెట్రో కావాలని అడుగుతున్నారు.

 

తప్పకుండా మెట్రో పటాన్‌ చెరు వరకు రావాలి. హైదరాబాద్‌ సిటీలో ఎక్కువగా ట్రాఫిక్‌ ఉండే కారిడార్‌ పటాన్‌చెరు నుంచి హయత్‌ నగర్‌ వరకు. కాబట్టి పటాన్‌చెరు నుందచి హయత్‌ నగర్‌ వరకు కచ్చితంగా మెట్రో వచ్చి తీరుతుంది. అయితే మీరు మరోసారి బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే వచ్చి తీరుతుంది. మళ్లీ ప్రభుత్వం ఏర్పడగానే మొట్ట మొదటి క్యాబినేట్‌ మీటింగ్‌లో పటాన్‌ చెరు నుంచి హయత్‌ మెట్రో రైలుకు ఆమోదముద్ర వేస్తామని మాటిస్తున్నాను. అందులో ఏమాత్రం సందేహం లేదు.రాష్ట్రం ఏర్పడే క్రమంలో అనేకమైనటువంటి అపవాదులు, అనేకమైన అపోహలు, అనుమానాలు కలిగించారు. తెలంగాణ చిమ్మని చీకటవుతుంది.. కరెంటు రానే రాదన్నారు. పటాన్‌చెరులో అప్పుడు పరిశ్రమల వారు కరెంటు కావాలని సమ్మెలు చేసేవారు.

 

ఇవాళ మూడుషిఫ్టుల్లో పరిశ్రమలు నడుస్తున్నయ్‌. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు 24గంటల కరెంటు ఇస్తున్నాం. ఎన్ని కష్టాలు, నష్టాలకోర్చి పరిశ్రమలు, డొమెస్టిక్‌, గృహాలకు, కమర్షియల్‌, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికీ నల్లాపెట్టి నీళ్లిచ్చే రాష్ట్రం తెలంగాణ. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ తెలంగాణ. ఎందుకు కొరగాకుండాపోతారని ఎవరైతే శాపాలు పెట్టారో వారిని మించిపో.. 3.17లక్షలతో పర్‌క్యాపిటా ఇన్‌కంలో దేశంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ స్థాయికి చేరుకున్నాం’ అన్నారు. ‘ఈ ప్రగతి అంతా మీ అందరి ప్రేమ, మద్దతు, కార్మికుల కృషి, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల కృషితో ఇదంతా సాధించాం.

 

మెట్రోరైల్‌ సంగారెడ్డికి రావాలంటున్నారు. తప్పనిసరిగా రావాలి. ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి వెళితే.. మహేశ్వరానికి మెట్రో రావాలని కోరారు. అక్కడే ఆ సభలోనే నేను చెప్పాను. హైదరాబాద్‌ సిటీలో అత్యధికంగా ట్రాఫిక్‌ ఉండే కారిడర్‌ పటాన్‌చెరు నుంచి దిల్‌సుఖ్‌నగర్‌. పటాన్‌చెరువు నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రోరావాల్సి ఉంది. మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే మెట్రో తప్పకుండా వస్తుంది. మళ్లీ వచ్చే ప్రభుత్వం తొలి కేబినెట్‌ సమావేశంలో పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్‌ మెట్రోరైలుకు మంజూరు ఇప్పిస్తానని వ్యక్తిగతంగా వాగ్ధానం చేస్తున్నాను. మహిపాల్‌రెడ్డి పారిశ్రామిక ప్రాంతానికి ప్రత్యేకంగా పాలిటెక్నిక్‌ కావాలని అడిగారు.

బోనాలు పండుగ అంటే తిని తాగుడు పండుగ: మంత్రలు తలసాని..

ఇవాళనే మంజూరు చేస్తూ జీవో జారీ చేస్తాం. ఈ ప్రాంతంలో విపరీతమైనటువంటి కాలనీలు వస్తున్నయ్‌. ఇప్పుడే కొల్లూరులో 17వేలపైచీలుకు డబుల్‌ రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశాం. పటాన్‌చెరువుకు 2వేల ఇండ్లు కేటాయిస్తున్నాం’ అన్నారు.‘పటాన్‌చెరువులు పరిశ్రమలు బాగా నడుస్తున్నయ్‌. ఒక కండ్ల అద్దాలు తయారు చేసే.. మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ వస్తే.. ఆ ఒక్క పార్కులో 15వేల మంది పని చేస్తున్నారని చెప్పడం సంతోషమనిపిస్తుంది. పటాన్‌చెరు ఇంకా అభివృద్ధి చెప్పాలి. ఇక్కడ ఐటీ ఇండస్ట్రీని మంత్రి కేటీఆర్‌ను పంపిస్తాను. త్వరలో ఐటీ కంపెనీలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తాం. భూపాల్‌రెడ్డి పదేపదే కోరుతున్నారు.

 

రామసముద్రం చెరువు సుందరీకరించి గొప్పగా చేయాలని కోరుతున్నారు. ఇరిగేషన్‌ శాఖ నుంచి నిధులు మంజూరు చేయాలని హరీశ్‌రావుకు సూచిస్తున్నా. సిద్దిపేట కోమటిచెరువు తరహాలో అభివృద్ధి చేస్తాం. కాలనీలు వచ్చిన వెంటనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రాదు. అదనంగా సహాయం కావాలని ఎమ్మెల్యే కోరుతున్నారు. మూడు మున్సిపాలిటీలకు రూ.30కోట్ల నిధులు, మూడు డివిజన్లకు రూ.30కోట్లు కేటాయిస్తున్నాం.55 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా అభివృద్ధి కోసం సీఎం ఫండ్‌ నుంచి రూ.15లక్షలు మంజూరు చేస్తున్నాం. ఎప్పటి నుంచే ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి రెవెన్యూ డివిజన్‌ కావాలని కోరుతున్నారు. త్వరలోనే రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తాం.

 

మాజీ సీఎస్‌ రాజీవ్‌శర్మకు నేను ధన్యవాదాలు చెప్పాలి. పదవీ విరమణ చేశాక నా కోరిక మేరకు పొల్యూషన్‌ బోర్డ్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈ ప్రాంతంలో పొల్యూషన్‌ రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఇక్కడ సూపర్‌ స్పెషల్‌ హాస్పిటల్ వచ్చేలా రాజీవ్‌ శర్మ చొరవ చూపారు. మనం కడుతున్న డబుల్‌ బెడ్రూం ఇండ్లు భారత్‌లో ఎక్కడా ఉండవ్‌. మంచినీళ్ల సరఫరా ఎక్కడా కనిపించదు. అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొని రాష్ట్రంలో నీళ్ల కరువు లేకుండా మటుమాయం చేసుకున్నాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంది’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అడిగిన మేరకు పాలిటెక్నిక్‌ కళాశాలకు ఈరోజు జీవో జారీ చేస్తాము’ అని చెప్పుకొచ్చారు.

 

కేసీఆర్‌ ఇంకా మాట్లాడుతూ.. పటాన్‌ చెరులో ఐటీ పరిశ్రమలు తీసుకొస్తాం. ఈ విషయమై కేటీఆర్‌తో మాట్లాడుతాను. పటాన్‌చెరు ఇంకా అభివృద్ధి చెందాలి. రామసముద్రం చెరువు సుందరీకరణ పనులు చేపట్టాలని అధికారులు సూచించారు.ఇక్కడ ఎకరం అమ్మి..అక్కడ 50 ఎకరాలు తెలంగాణలో ఎకరం భూమి అమ్మి ఏపీలో 50 నుంచి 100 ఎకరాలు భూమి కొంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు అన్న ఆ మాటలను ఇప్పుడు కేసీఆర్ ఉటంకించారు. ఏపీలో సీఎం జగన్ వల్ల సంపద నాశనం అయిపోయిందని, భూముల రేట్లు పడిపోయాయని ఇటీవల చంద్రబాబు ఓ రోడ్ షోలో అన్నారు.

 

గతంలో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదుల సంఖ్యలో ఎకరాలు కొనేవాళ్లని, జగన్ వచ్చాక పరిస్థితి తారుమారైందని విమర్శించారు. తాజాగా చంద్రబాబు మాటలను పటాన్ చెరు పర్యటనలో భాగంగా కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. పటిష్ఠ నాయకుడు, నాయకత్వం ఉంటే అన్నీ సాధ్యమవుతాయని కేసీఆర్ అన్నారు.సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరులో ఓ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.183కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ కట్టనున్నారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి నిర్మాణానికి పునాదిరాయి వేశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie