కండువాకప్పి జనసేన పార్టీలోకి చేర్చుకొన్న జగిత్యాల ఇంచార్జ్ బేక్కం జనార్దన్
జగిత్యాల: పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి జగిత్యాల జిల్లా లో ఆదరణ పెరుగుతోందని వివిధ ప్రాంతాల యువత జనసేనలో చేరారని ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బెక్కం జనార్దన్ తెలిపారు. బుధవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో విడుదల చేసిన ప్రకటనలో జగిత్యాల పట్టణంతోపాటు సారంగపూర్ కు చెందిన యువత జనసేనలో చేరారన్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి యువత స్వచ్ఛందంగా పార్టీలో చేరరన్నారు.
యువత కొత్త చేరికలతో జనసేన ను గడప గడపకు చేర్చే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని బెక్కం జనార్దన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జన సేన పార్టీ పట్టణ అధ్యక్షులు చింత సుధీర్,పట్టణ ప్రధాన కార్యదర్శి గట్ల శ్రీకర్, జగిత్యాల మండల అధ్యక్షులు బొల్లి రాము, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు చింత సుధీర్,ఉపాధ్యక్షులు ఈశ్వర్, వంశీ, పవన్ కళ్యాణ్, నావనంది రమేష్, యెల్ల ప్రశాంత్ ,లింగయ్య,ఉమేష్,శేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.