2014 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉన్న పది స్థానాలను టీడీపీ కోల్పోయింది. వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. అయితే.. ఇప్పుడు వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమయింది. తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నట్టు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును ఆనం రామనారాయణరెడ్డి కలిశారు.
శనివారం ఆనం రామనారాయణరెడ్డి ఇంటికి టీడీపీ కీలక నేతలు వెళ్లారు. చర్చలు రిపారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరేందుకు ఆయన ఓకే చెప్పారు. మూడు రోజుల్లో నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనున్న యువగళం పాదయాత్రను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు ఆనం. అన్ని విషయాలు చర్చించామని పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రపై కూడా మాట్లాడుకున్నామని వివరించారు. నెల్లూరు జిల్లాలో కీలక పరిణామాలు జరిగాయి. ఆనం రామనారాయణ రెడ్డితోపాటు మరో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డిని కలిశారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, వేమిరెడ్డి పట్టాభి కలిశారు.
కోటంరెడ్డి నివాసంలో సుధీర్ఘ చర్చలు నిర్వహించారు. టీడీపీలోకి రమ్మంటూ ఆహ్వానం పలికారు ఇప్పటికే కోటంరెడ్డి స్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఈ నెల 13 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. ఈ క్రమంలోనే టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు.
పవన్ యాత్రకు సర్కారీ బ్రేకులు.
బద్వేలు నియోజకవర్గం అట్లూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మేకపాటి సంఘీభావం తెలిపారు. ఈ నెల 13 న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. ఈ క్రమంలోనే లోకేష్‌తో మేకపాటి భేటీ అయ్యారు. తాను పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వైసీపీలో తనకు టిక్కెట్ ఇచ్చేది లేదన్నారని.. ఎమ్మెల్సీ ఇస్తామన్నారని.. కానీ తానుటీడీపీలో చేరుతున్నాన్నారు. టీడీపీలో టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తానని ప్రకటించారు.