Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రాష్ట్రాల వారీ గణాంకాలు చూస్తే ‘జీఎస్టీ’లో ఏపీ అగ్రస్థానం ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.

0

టీడీపీ పాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పరిపాలన, ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్ధామా ? ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు, యనమల తలో మాటా తగదు. స్పష్టత ఉంటే చర్చకు రావాలని చంద్రబాబు, యనమలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి  సవాల్ విసిరారు. పాలన రాదు, ఆదాయం లేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు బాధ్యతారాహిత్యం. పథకాలు ఇస్తే ఉచితాలు అంటున్నారు.. టీడీపీ ఇచ్చిన హామీలు ఉచితాలు కావా?  తమకంటే ఎక్కువ ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారు..మేం ప్రజలకు నేరుగా ఇస్తే ఉచితం, మీరిస్తే సముచితమా? పాలన రాదనేవారికి గడచిన నాలుగేళ్లుగా పన్ను వసూళ్లు పెరగడమే సమాధానమని మంత్రి అన్నారు.

 

గతంలో కంటే మెరుగ్గా రహదారులపై ప్రభుత్వం వ్యయం చేసిందని అసెంబ్లీలో ఆధారాలతో సహా వెల్లడించాం. కర్ణాటకలో జీఎస్టీ పెరుగుదల 1 శాతం కన్నా తక్కువ పెరుగుదల. మహారాష్ట్ర దేశంలో రెండో స్థానంలో ఉన్నా, రాష్ట్ర జీఎస్టీ కూడా 1 శాతం తక్కువే. సెంట్రల్ జీఎస్టీతో పోలిస్తే ఏపీలో 4 శాతం మేర అదనంగా పన్ను వసూళ్లు. కోవిడ్ విపత్తు ఉన్నా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా మెరుగ్గా ఉంది. ఎన్నో కీలక సంస్కరణలతో పన్నుదారులకు అన్నివిధాల అండగా ప్రభుత్వం వుంది. అందువల్లనే పన్నువసూలులో ఆంధ్రప్రదేశ్ ముందంజ వేసింది. వాణిజ్య పన్నుల శాఖలోనూ చాలా సంస్కరణలు అమలు చేశాం. ‘డీలర్ ఫ్రెండ్లీ’ సీఎం జగన్ నాయకత్వంలోని  ప్రభుత్వ విధానం.

 

చీఫ్ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ టాక్స్ కార్యాలయం ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నాం. ట్రేడర్లు, డీలర్లు వెంటపడి పన్నులు కట్టించడం కంటే వారే స్వయంగా పన్నులు చెల్లించే వ్యవస్థను తీసుకువచ్చాం. రోడ్లపై వేధించే చర్యలు, ఆకస్మిక తనిఖీలు ఎక్కడా లేవు.  ఎక్కడైనా పొరపాట్లు జరిగిందని పరిశీలన చేసి నిర్ధారించుకున్న తర్వాతే తనిఖీలు చేస్తున్నారు. 2022-23లో రూ.28,103 కోట్లు పన్నులు ద్వారా వసూలు అయ్యాయి. అంతకు ముందు ఏడాది 2021-22లో రూ. 23,386 కోట్ల వసూలు.

నన్ను పాలించే వాడు నాకంటే నిజాయితీ పరుడై ఉండాలి.. అందుకే నేను పోరాటం చేస్తున్న.

ఇన్వర్ట్ పిరమిడ్ తరహాలో పాలన విధానం వాణిజ్య పన్నుల శాఖలో అమలు చేస్తున్నాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎప్పుడో ఒకసారి మాత్రమే వేతనాలు ఆలస్యం.కొన్ని  విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజల క్షేమమే మా ప్రథమ లక్ష్యం కూడా. పారదర్శకంగా నిర్ణయాలు అమలు కావాలనే సంస్కరణలు చేపట్టామని అన్నారు. ఒక రోడ్డు ఇబ్బందిని చూపించి, రాష్ట్రమంతా అలాగే ఉన్నట్లు రాయడం దారుణం. ప్రభుత్వ శాఖల విధులు బాధ్యతల్లో ‘పిరమిడ్’ విధానం. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఆలోచనతో కూడిన ఆచరణలు.

 

విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ ,ఆడిట్, రిజిస్ట్రేషన్ల వేర్వేరుగా విభజించి పారదర్శకతను పెంచాం. వ్యక్తులపరంగా పొరపాట్లు జరగకూడదని ఈ తరహా విధానం. అధికారులకు కూడా ఈ విభజించిన పద్ధతి ఓ వెసులుబాటు. పన్నులకు సంబంధించి బకాయిలను పరిష్కరించడం కోసం ‘లీగల్ సెల్’ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమానికి  వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ గిరిజా శంకర్, అడిషనల్  కమిషనర్ కృష్ణమోహన్, కమిషనర్ రవిశంకర్, తదితరులు హజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie