కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసిటిసి
ఆధ్వర్యంలో బుధవారం హెచ్ఐవి, ఎయిడ్స్ నియంత్రణలో భాగంగా
హెచ్ఐవి, ఎయిడ్స్ రోగాలపై స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో
విద్యార్థులకు అవగాహన కల్పించారు..ఈ సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత రాణి ,ఐసిటిసి కౌన్సిలర్ మల్లికార్జున్, ఎస్ఎస్కే మేనేజర్ సంతోష్ ,అవుట్ రీచ్ వర్కర్స్ విక్టర్, సంపూర్ణ హెచ్ఐవి, ఎయిడ్స్ రాకుండా జాగ్రత్తలు, మరియు రావడానికి గల కారణాలను వివరించారు.అలాగే హెచ్ఐవి, ఎయిడ్స్ సోకిన రోగులకు
ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ రకంమైన చికిత్స అందిస్తున్నారో తెలియ జేశారు..ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య ప్రిన్సిపాల్ డాక్టర్ నీలి వాసవి ,రెడ్ రైబన్ క్లబ్ కోఆర్డినేటర్ జి. నీరజ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి .నరేష్,
ఎన్ఎస్ఎస్ పీవో మల్లికార్జున్, అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థిని ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Next Post