Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

బింబిసార సక్సెస్ జోష్ తోనే అమిగోస్ చేసాను: కళ్యాణ్ రామ్

0

కళ్యాణ్​రామ్​ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం అమిగోస్. అషికారంగనాథ్​ హీరోయిన్​గా నటిస్తున్న ఈ చిత్రంలో  హీరో కళ్యాణ్రామ్​ త్రిపాత్రాభినయంలో నటిస్తున్నారు.  ఫిబ్రవరి 10న విడుదలవుతున్న ఈ చిత్ర విశేషాల గురించి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ… బింబిసార సక్సెస్​జోష్​తోనే అమిగోస్​ చిత్రం తీశాను. ఏదైనా సినిమా హిట్​ అయితే మన పై మనకు కాన్ఫిడెన్స్​ బాగా పెరుగుతుంది. దాంతో కాస్త బాధ్యత కూడా ఇంకా ఎక్కువవుతుంది. అందుకే ఇందులో కాస్త కొత్తగా ప్రయత్నించాను.

పూర్తి భిన్నమైన కథ. ఒకే పోలికతో ముగ్గురు వ్యక్తులు ఎలా కలిశారు. అన్న కథాంశంతో  మొత్తం ఆద్యంతంగా ఉంటుంది. ఫ్రెండ్​షిప్​కి సంబంధించిన టైటిల్​ పెట్టాలని ఈ టైటిల్​ పెట్టాం.  సినిమా మొత్తం 2గంటల 19 నిమిషాలు ఉంటుంది. ఎక్కువగా కళ్యాణ్​రామ్​ కనిపిస్తారు. మా కుటుంబంలో నుంచి త్రిపాత్రాభినయం సినిమాలు ఎక్కువగా వచ్చాయని అనుకుంటున్నారు. మా కుటుంబంలోని హీరోలకు ఇలాంటి కథలు రావడం మా అదృష్టం. ఆషికాను హీరోయిన్​గా టీం అంతా కలిసి ఓకే చేశాం. ఆమె మంచి డ్యాన్సర్​. కన్నడ, తమిళంలో  కొన్ని చిత్రాల్లో నటించింది. ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్​ స్కోర్​ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నా తరువాత చిత్రం డెవిల్​ షూటింగ్​ 70శాతం పూర్తయింది. మరో మూడు నెలల్లో పూర్తవుతుంది. బింబిసార2 ఈ ఏడాది చివరలో షూటింగ్​ మొదలయ్యే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie