జయశంకర్ జిల్లాలో దారుణం
భార్యను రోకలిబండతో కొట్టి హతమార్చిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.గ్రామానికి చెందిన చిగురు గణేష్- సంధ్య భార్యభర్తలు.వీరి మధ్య అదనపు కట్నం విషయమై గోడవలు జరుగుతున్నాయి.
కొద్దిరోజులుగా వీరు వేర్వేరుగానే ఉంటున్నారు. తాజాగా గణేష్ తండ్రి సంవత్సరికం ఉండగా.. ఇటీవల భార్యను తీసుకొచ్చాడు.ఈ క్రమంలో మళ్లీ గొడవ కావడంతో ఆగ్రహానికి గురైన గణేష్ సంధ్యను రోకలి బండితో కొట్టి చంపాడు. అయితే ఇంట్లో కాలు జారి కిందపడి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు. సంధ్య బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.