రూ. 3857 వద్ద కొనసాగిన షేర్ ధర
కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో ఇప్పటికే పలు రంగాలు వృద్ధి వైపు పయనిస్తున్నాయి. తాజాగా మరో ప్రభుత్వ సంస్థ షేర్లు రికార్డు స్థాయికి చేరాయి. భారత రక్షణ, విమానయాన రంగంలోని కీలక సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) వృద్ధిలో మరో రికార్డును సొంతం చేసుకుంది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేరు ధర రూ.3857.9కి చేరింది. ఐదేళ్ల క్రితం వెయ్యి రూపాయల లోపే ఉన్న హెచ్‌ఏఎల్ షేర్ ధర.. ఐదేళ్లలో దాదాపు ఐదు రెట్లు పెరిగింది. ఐదేళ్లలో హెచ్‌ఏఎల్ సాధించిన ఈ విజయం కేంద్రానికే చెందుతోందని పలువురు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.
LCA -Light Combat Aircraft (లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్)ని కంపెనీ
HAL fighter jet Tejas, light weight helicopter Dhruv హెచ్‌ఏఎల్ యుద్ధ విమానం తేజస్, లైట్ వెయిట్ హెలికాప్టర్ ధృవ్ వంటి వాటిని ఉత్పత్తి చేసింది. ప్రపంచంలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. వీటిని కొనుగోలు చేసేందుకు చాలా దేశాలు హెచ్‌ఏఎల్‌తో చర్చలు జరుపుతున్నాయి. భారత వైమానిక దళం కోసం తేజస్, ధ్రువ్, ప్రచండ, రుద్ర వంటి విమానాలు, హెలికాప్టర్లను హెచ్ఏఎల్తయారు చేస్తోంది. దీనితో పాటు భారత వైమానిక దళం కోసం భవిష్యత్ యుద్ధ విమానాలను కూడా సిద్ధం చేస్తోంది. రష్యా కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధ విమానాలను సైతం హెచ్‌ఏఎల్ తయారు చేసింది. ప్రస్తుతం ఎల్సీఏ LCA -Light Combat Aircraft (లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్)ని కంపెనీ తయారు చేస్తోంది. దీనినే తేజస్ అని కూడా అంటారు.
Also Read: అమిత్ షాతో బండి భేటీ
దీనితో పాటు, ఈ కంపెనీ డోర్నియర్ వంటి ప్రయాణీకుల విమానాలను కూడా తయారు చేస్తుంది. ఇంకా హెచ్ఏఎల్ధృవ్, చిరుత, చేతక్, లాన్సర్, చీతల్, రుద్ర, ఎల్సీహెచ్, ఎల్యూహెచ్లను తయారు చేస్తుంది. Indian public sector aerospace – defense company Hindustan Aeronautics Ltd భారతీయ ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ – డిఫెన్స్ కంపెనీ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ను 23 డిసెంబర్ 1940న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. హెచ్ఏఎల్ప్రపంచంలోని పురాతన, Largest Aerospace, Defense అతిపెద్ద ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీదారులలో ఒకటిగా ఉంది. కాగా మొదటి సారిగా ప్రభుత్వ రంగ రక్షణ సంస్థకు చెందిన షేర్ ఈ రేంజ్లో పెరగడం అరుదేనని నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులోనూ ఈ పెరుగుదల నమోదవుతూనే ఉండే అవకాశం ఉందన్నారు.