Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

WhatsApp Updates: ఒకే ఫోన్ లో రెండు రెండు వాట్సాప్ లు

More accounts from WhatsApp account

0

వాట్సప్ అకౌంట్ నుంచి మరిన్ని అకౌంట్లు
వాట్సాప్ ప్రస్తుతం మల్టీపుల్ అకౌంట్ లాగిన్ ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ ఫీచర్ కింద మీరు ఒకే యాప్‌లో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను ఉపయోగించగలరు. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు వెళ్లడానికి మీరు స్విచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రకమైన ఫీచర్‌ను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా అందించింది.మల్టీపుల్ అకౌంట్ లాగిన్ ఫీచర్ పరిచయంతో మీరు ఫోన్‌లో ప్యారలల్ స్పేస్, డ్యూయల్ యాప్స్ వంటి యాప్స్‌ను ఉంచాల్సిన అవసరం లేదు. ఈ అప్‌డేట్ గురించిన సమాచారాన్ని వాట్సాప్ డెవలప్‌మెంట్‌ను పరిశీలించే వెబ్‌సైట్ Wabetainfo షేర్ చేసింది.ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కొన్ని బీటా టెస్టర్ల కోసం విడుదల చేశారు. రాబోయే కాలంలో కంపెనీ దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.

How To Use Dual WhatsApp Accounts On The Same Phone

మీరు కూడా ముందుగా వాట్సాప్‌కు సంబంధించిన అన్ని కొత్త ఫీచర్లను పొందాలనుకుంటే, దీని కోసం మీరు కంపెనీ బీటా ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకోవాలి.కొత్త అకౌంట్‌ను యాడ్ చేయడానికి మీరు సెట్టింగ్స్‌కు వెళ్లి క్యూఆర్ కోడ్ బటన్ పక్కన ఉన్న యారో సింబల్‌పై నొక్కాలి. అక్కడ నుంచి మీరు అకౌంట్‌ను యాడ్ చేయగలరు. అకౌంట్‌ను యాడ్ చేసిన తర్వాత మీరు దాని నుంచి లాగ్ అవుట్ అయ్యే వరకు ఆ అకౌంట్ కూడా మీ డివైస్‌లో లాగిన్ అయి ఉంటుంది. అంటే మీరు ఖాతాలను స్విచ్ చేసినప్పుడు మళ్లీ మళ్లీ లాగిన్ చేయవలసిన అవసరం ఉండదు. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు వారి వ్యక్తిగత ఛాట్‌లు, వర్క్ ఛాట్‌లు, ఇతర ఛాట్‌లను ఒకే యాప్‌లో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. కొత్త ఫీచర్ నోటిఫికేషన్లతో పాటు మీ ఛాటింగ్‌లను వేరుగా ఉంచుతుంది.

Also Read: దేశంలో కాంగ్రెస్‌ను నమ్మే స్థితి లేదు

దీని కారణంగా మీరు వివిధ డివైసెస్ లేదా ప్యారలల్ యాప్స్ వాడాల్సిన అవసరం లేదు. ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఉపయోగిస్తున్న వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది.ఇది కాకుండా ప్రస్తుతం వాట్సాప్ డజన్ల కొద్దీ కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. కాలక్రమేణా యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరచడం కంపెనీ లక్ష్యం. త్వరలో కంపెనీ యూజర్‌నేమ్ ఫీచర్‌ని కూడా రోల్‌అవుట్ చేయగలదు. ఇది నంబర్ షేరింగ్‌ను ఎలిమినేట్ చేస్తుంది. దీని కారణంగా నంబర్ లేకుండా వాట్సాప్‌లో ఛాట్ చేసుకునే అవకాశం ఉంది.మరోవైపు ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం ఒకే గూగుల్ అకౌంట్‌తో డివైస్‌లను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడానికి సహాయపడే ఒక ఫీచర్‌పై టెక్ దిగ్గజం గూగుల్ పని చేస్తోంది. దీనికి సంబంధించి ఆండ్రాయిడ్ నిపుణుడు మిషాల్ రెహమాన్ కూడా ఎక్స్‌లో (ట్విట్టర్‌) ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. గూగుల్ త్వరలో Call switching “కాల్ స్విచింగ్” వంటి ఫీచర్లను ప్రారంభించవచ్చని తెలిపారు.

Source: Newspuls

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie