Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

చంద్రయాన్​ప్రయాణం సాగిందిలా!

0

చంద్రయాన్3ని శ్రీహరికోటలోని సతీశ్​ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 14 మధ్యాహ్నం 2:35 గంటలకు ఎల్‌వీఎం–3- ఎం 4 రాకెట్లో అంతరిక్షంలోకి పంపించారు. ఆ మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. ఆగస్టు 23న చంద్రుడిపై విక్రమ్​ల్యాండర్‌ అడుగుపెట్టింది.

చంద్రయాన్-– 3 గమ్యం చేరిందిలా..
జూలై 14 : ఇస్రో LVM3 M4 చంద్రయాన్-–3ని దాని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
జూలై 15 : మిషన్ మొదటి కక్ష్యను పెంచే ప్రక్రియ బెంగళూరులో విజయవంతమైంది. అంతరిక్ష నౌక 4,1762 కిమీ x 173 కిలో మీటర్ల కక్ష్యకు చేరుకుంది.
జూలై 17 : రెండో కక్ష్య-లోకి పంపే ప్రక్రియలో భాగంగా చంద్రయాన్-–3ని 41,603 కిమీ x 226 కిలోమీటర్ల కక్ష్యలో ఉంచింది.
జూలై 22 : నాల్గవ కక్ష్య భూమి -బౌండ్ పెరిజీ ఫైరింగ్, అంతరిక్ష నౌకను 71,351 కి.మీ x 233 కి.మీ కక్ష్యలో విజయవంతంగా ఉంచింది.
జూలై 25 : మరో కక్ష్యను పెంచే విన్యాసం విజయవంతంగా జరిగింది.
ఆగస్టు 1 : చంద్రయాన్-–3 288 కిమీ x 3,69,328 కిమీ కక్ష్యతో ట్రాన్స్‌లూనార్ కక్ష్యలోకి ప్రవేశించింది.
ఆగస్టు 5 : అంతరిక్ష నౌక 164 కిమీ x 18,074 కి.మీ వద్ద చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది.
ఆగస్టు 6 : అంతరిక్ష నౌక కక్ష్య చంద్రుని చుట్టూ 170 కి.మీ x 4,313 కి.మీకి తగ్గించారు.
ఆగస్టు 9 : అంతరిక్ష నౌకను 174 కి.మీ x 1437 కి.మీకి తగ్గించే మరో యుక్తిని ప్రదర్శించారు.
ఆగస్టు 14 : మిషన్ 151 కిమీ x 179 కి.మీ కక్ష్యకు సంబంధించి కక్ష్య సర్క్యులరైజేషన్ దశలోకి ప్రవేశించింది.
ఆగస్ట్ 16 : ఫైరింగ్ తర్వాత అంతరిక్ష నౌక 153 కి.మీ x 163 కి.మీ కక్ష్యలోకి ప్రవేశించింది.
ఆగస్టు 17 : విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ దాని ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి వేరు చేశారు.
ఆగస్టు 18 : అంతరిక్ష నౌక విజయవంతంగా ‘డీ బూస్టింగ్’ ఆపరేషన్‌ను పూర్తి చేసింది. దాని కక్ష్యను 113 కిమీ x 157 కిమీకి తగ్గించింది. డీబూస్టింగ్ అనేది చంద్రునికి కక్ష్యలోని అత్యంత సమీప బిందువు (పెరిలున్) 30 కి.మీ. సుదూర బిందువు (అపోలూన్) 100 కి.మీలు ఉన్న కక్ష్యలో తన స్థానాన్ని తగ్గించుకునే ప్రక్రియ.
ఆగస్టు 20 : చంద్రయాన్-–3 రెండో, చివరి డీబూస్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించింది. LM కక్ష్యను 25 కి.మీ x 134 కి.మీకి తగ్గించింది.
ఆగస్టు 23 : అంతరిక్ష నౌక చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie