Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వర్షానికి కూలిన ఇండ్లు

Houses collapsed due to rain

0
  • బాధితులకు తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసిన సర్పంచ్
  • పరిశీలించిన తహసిల్దార్, ప్రజా ప్రతినిధులు

వర్షానికి కూలిన ఇండ్లను పరిశీలించిన ఎల్లారెడ్డిపేట తహసిల్దార్, ప్రజా ప్రతినిధులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం ప్రభావానికి కిషన్ దాస్ పేట కు చెందిన నూకల ఎల్లవ్వ ఇల్లు ఒగ్గు నరసవ్వ పరశురాములకు అద్దెకు ఇచ్చారు. అందులో పరుశరాములు ఇద్దరు పిల్లలతో నివసిస్తుండగా శుక్రవారం ఇంట్లో ఉన్న దేవుని గది పైకప్పు ఒక్కసారిగా కింద కూలిపోయింది. పక్క రూమ్ లో ఉన్న కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు.

భారీ ప్రమాదం తప్పింది

అదేవిధంగా నిన్నటి రోజు ఒగ్గు రాజవ్వ, ఆనాటి పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణ కార్యదర్శి దొంత మార్కండీ అలియాస్ శంకరన్న ఇల్లు వర్షం దాటికి ఇండ్లు కూలిపోగా సమాచారం తెలుసుకున్న సర్పంచ్ నెవూరి వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్, వార్డు సభ్యులు కొడుమోజు దేవేందర్, ద్యాగం నారాయణ, బిజెపి పట్టణ అధ్యక్షులు నేవూరి శ్రీనివాస్ రెడ్డిలు బాధితుల ఇండ్లకు వెళ్లి పరిశీలించి స్థానిక తహసిల్దార్ కు సమాచారం ఇవ్వగా తాసిల్దార్ జయంత్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకుని ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా చూస్తానని బాధితులకు హామీ ఇచ్చాడు.బాధితులకు తాత్కాలికంగా నివసించేందుకు సర్పంచ్ వెంకట్ రెడ్డి తన ఫంక్షన్ హాల్ ను ఏర్పాటు చేశాడు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie