బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్వలింగ సంపర్కులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న ఓ ముఠా కలకలం రేపింది. అయితే ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు బాధితులు ఈ గ్యాంగ్తో ఇబ్బందులను ఎదుర్కొన్న విషయాన్ని బయట పెట్టారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొదటి ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని ఎన్బీటీ నగర్ లో నివాసం ఉంటున్న 23 ఏళ్ల సాఫ్ట్ ఉద్యోగికి సంబంధించింది. ప్రముఖ గే డేటింగ్ యాప్ గ్రిండర్ని ఉపయోగిస్తున్నప్పుడు, అతడికి ఆగస్టు 1న ఓ ప్రొఫైల్ కనిపించిందని, ఆ ప్రొఫైల్లోని వ్యక్తి బంజారాహిల్స్ లో ని భోలానగర్ గా తన లొకేషన్ షేర్ చేసుకున్నాడు.
బాధితుడు సదరు వ్యక్తిని నిర్దేశిత ప్రదేశంలో కలవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులకు చెప్పాడు. అక్కడికి చేరుకోగానే ఆ వ్యక్తి కత్తితో బాధితుడిని బెదిరించి బట్టలు విప్పమని బెదిరించాడు. వీడియోలు తీసి ఆ వ్యక్తి బాధితుడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. వెండి కంకణం, వెండి గొలుసు, రూ.2000 నగదును లాక్కుని ఎత్తుకెళ్లాడు. అతను తప్పించుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మరో బాధితుడు కుడా ఇదే పరిస్థితి ఎదుర్కున్నాడు.