హోలీ ప్రిన్స్ ఫౌండేషన్ ,హెల్ టాటామని చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆద్వర్యం లో షేర్ లింగం పల్లి చందా నగర్ లో అనాధ, పేద పిల్లలకు భోజనం,నోట్ బుక్స్ పంపిణి చేసారు. కెనడాకు చెందిన ఫైనలిస్ట్ శ్రీలత జుజారే ఆహారాన్ని స్పాన్సర్ చేయగా హెల్ టాటామణి చారిటబుల్ ట్రస్ట్ చేర్మెన్ కాకుమాను జ్యోతి నోట్ బుక్స్ పుస్తకాలను ప్రోవైద్ చేసారు. ఈ సందర్బంగా హోలీ ప్రిన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ కొమ్ము ప్రవీణ్ కుమార్,
హెల్ టాటామని చారిటబుల్ ట్రస్ట్ చేర్మెన్ కాకుమాను జ్యోతి మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆద్వర్యం లో పేదలు అనాదలకు కాలనుగునగా బట్టలు, ఆహరం,నిత్యావసర వస్తువులను అందిస్తున్నట్లు తెలిపారు. ఇక ముందు కూడా పేదల విషయం లో లో విద్య, వైద్యం తో పాటు వారి సమస్యలను తెలియ పరచినట్లయితే తమ సంస్థలు ముందుంతాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో పి.జగదీష్ కుమార్, పి.ఉషా రాణి, జి. జగదాంబ, పి.జ్యోష్న, బి.ప్రేమలత, కె. అన్నపూర్ణ యాదవ్, చ. శాంత కుమారి, పి.యాదమ్మ రాణి, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.