శ్రీనివాసన్ గురు సమర్పణ లో యస్ యస్ బి ఫిల్మ్స్ పతాకంపై సాత్విక్ వర్మ, జాక్ రాభిన్ సన్,,మంజీరా రెడ్డి, అమీర్తా హాల్దర్ నటీ నటులుగా ముత్తు.యం దర్శకత్వంలో శ్రీనివాసన్ గురు తెలుగు,తమిళ్ భాషల్లో నిర్మించిన చిత్రం “చిక్లెట్స్”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో రామ్ కార్తీక్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. “చిక్లెట్స్” ట్రైలర్ చాలా బాగుంది. ఇందులో నటించిన వారి స్క్రీన్ ప్రెజెంటేషన్ బాగుంది.2కె జనరేషన్ అని పెట్టారు.ఇప్పుడున్న జనరేషన్ అందరూ మోర్ రెస్పాన్స్ బిలిటీ గా ఉన్నారు.వారికీ ఏది కావాలి, ఏది వద్దు అని పూర్ మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు. పిల్లలకు పేరెంట్స్ కు మంచి మెసేజ్ ఉండేలా తెరకెక్కిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
డైరెక్టర్ ముత్తు.యం. మాట్లాడుతూ..సినిమా అంటే నాకు చాలా ఇష్టం.తమిళ్ లో శంకర్ దగ్గర రోబో సినిమాకు , తెలుగులో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దగ్గర ఆసిసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను.తమిళ్ లో ఒక సినిమా చేసిన తరువాత నిర్మాత శ్రీనివాసన్ తెలుగు, తమిళ్ సినిమాకు డైరెక్టర్ చేసే అవకాశం కల్పించారు.వారికి నా ధన్యవాదాలు. 90 జనరేషన్, 2కె జనరేషన్ పిల్లలకు, పేరెంట్స్ కు మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ ఈ సినిమాలో చెప్పడం జరిగింది.ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లల కెరీర్ గురించే ఆలోచిస్తారు. పిల్లలపై తల్లి తండ్రులకు ఎలాంటి ప్రేమ ఉంటుందో, అలాగే పిల్లలకు కూడా తల్లీ తండ్రులపై అదే విధమైన ప్రేమ ఉన్నా వారికి ఒక ఏజ్ వచ్చిన తరువాత వారి ఆలోచనలు రాంగ్ డైరెక్షన్ లో వెళుతున్నప్పుడు వారికి సొసైటీ నుంచి వారు ఏమీ తీసుకోలేరు, సొసైటీ వారికి ఏమీ ఇవ్వదు. ఫ్రెండ్స్ ఎవరూ ఏమి చెప్పరు. అటువంటి సమయంలో వారికి మంచి చెప్పే దైర్యం ఒక్కతల్లి, తండ్రులకు మాత్రమే ఉంటుంది.
ఈ సినిమాను పేరెంట్స్, కిడ్స్ అందరూ వచ్చి చూడచ్చు ఇందులో లవ్, ఎంటర్టైన్మెంట్ , పేరెంట్స్ ఎమోషన్ ఇలా అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది.కాబట్టి ఇందులో 90 కిడ్స్ కు,2 కె కిడ్స్ ఉన్న డిఫరెంట్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మా చిక్లెట్స్ సినిమా చూడాలి. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన నిర్మాతకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.నిర్మాత శ్రీనివాసన్ గురు మాట్లాడుతూ.. ఐశ్వర్య రాజేష్ తో ఒక సినిమా చెయ్యాలని చిన్న డిస్కషన్ కోసం ముత్తు గారు వెళ్ళినప్పుడు ఆ స్టోరీ నచ్చి సినిమా చేద్దాం అనుకున్నారు. టెక్నిషియన్స్ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. పేరెంట్స్, కిడ్స్ మధ్య ఉన్న అన్ని ఎమోషన్స్ కలిపి ఈ సినిమాను అందరూ వెళ్లి చూడచ్చు. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో తీస్తున్నాను అనగానే చాలా మంది ఫ్రెండ్స్ తమిళ్ లో తీస్తున్నావ్ కదా తెలుగులో ఎందుకు అన్నారు.అయితే ఈ సినిమా చేశాను.
లైన్ ప్రొడ్యూసర్ డానియల్ మాట్లాడుతూ .. ఇది 90 కిడ్స్ కోసం తీసిన సినిమాకు కాదు.2 కె కిడ్స్ కోసం తీసిన ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంటుంది. చూసిన వారందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది ఆన్నారు
గెస్ట్ గా వచ్చిన దర్శకులు శివం మాట్లాడుతూ.. ట్రైలర్ లో చూపించిన నెగిటివ్ థింక్స్ మాత్రమే కాకుండా ఇందులో చాలా పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. 2కె కిడ్స్ పేరెంట్స్ కు మంచి మెసేజ్ ఉంది. ఈ సినిమా చూసిన తరువాత మీకే అర్థమవుతుంది అన్నారు.నటి మంజీరా రెడ్డి మాట్లాడుతూ.. ఇందులో నాకు మంచి పాత్ర ఇచ్చారు. మనకు లైఫ్ లో ఎన్ని ఏమోషన్స్ వుంటాయో..ఈ సినిమాలో కూడా అన్ని ఏమోషన్స్ ఉంటాయి. ఈ మధ్య మనకు పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారో అంతే ఫ్రీడమ్ కూడా ఇస్తున్నారు. అయితే వారిచ్చిన ఫ్రీడమ్ ను మిస్ యూజ్ చేసుకోకండి అని తెలిపేదే ఈ సినిమా హీరోయిన్ అమీర్తా హాల్దర్ మాట్లాడుతూ..ఇది నా తెలుగు, తమిళ్ మూవీ.
ఇందులో నా పాత్ర చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.హీరో సాత్విక్ మాట్లాడుతూ.. ఈ మూవీ చేయడానికి కారణం ముత్తు అన్న. నాకు తెలుగు రాకపోయినా తమిళ్ నేర్చుకొని ఈ కథ విన్నాను. పేరెంట్స్, పిల్లలకు ఎలాంటి ఫ్రీడమ్ ఇస్తున్నారు. వారు ఆ ఫ్రీడమ్ ను ఎలా మిస్ యూజ్ చేసుకుంటున్నారు.అనేది బాగా నచ్చి ఈ సినిమా చేశాను. ఈ మూవీ అంతా 26 డేస్ లో తెలుగు, తమిళ్ లో బై లింగ్వేల్ లో ఒకే సారి షూటింగ్ చేశాము.ట్రైలర్ లో, సాంగ్స్ లో చూపించినట్లు సినిమా లో అంతగా ఏముండదు. యూత్ అందరికీ నచ్చే విధమైన మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.నటీ నటులు సాత్విక్ వర్మ, జాక్ రాభిన్ సన్,రిజిమా, మంజీరా రెడ్డి, నాయన్ కరిజ్మా, అమీర్తా హాల్దర్ తదితరులు