Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అచ్చెన్నాయుడుపై దువ్వూరి వాణి..

0

శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా.. జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణిని ఖరారు చేసినట్లు.. ఆమె భర్త, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు. గత నెల శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా.. ముఖ్యమంత్రి జగన్ దువ్వాడ శ్రీనివాస్ పేరును ప్రకటించారు. ఇది జరిగిన నెల రోజుల్లోనే ఆయన సతీమణి దువ్వాడ వాణి  పేరును ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది.అయితే.. ఇటీవల కాలంలో దువ్వాడ శ్రీనివాస్, వాణి దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఆ ప్రచారం అంతా తప్పు అని మీడియా సమావేశం పెట్టి దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు.

 

స్వయంగా దువ్వాడే విలేకరుల సమావేశం నిర్వహించి మరీ వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచి వైకాపా తరఫున వాణీ బరిలో ఉంటారని శుక్రవారం ప్రకటించడంతో కొన్నాళ్లుగా కుటుంబంలో నడుస్తున్న రాజకీయ పంచాయతీకి తెరపడినట్లయింది.  వైకాపా అధికారంలోకి వచ్చాక జిల్లాలో దువ్వాడ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రద రిస్తూ వచ్చారు. ఆయనను ఇన్ఛార్జ్ ప్రకటించి తిలక్‌కు  కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవిని జగన్ కట్టబెట్టారు. సీఎంఓలోనూ దువ్వాడకు మంచి ప్రాధాన్యం, పలుకుబడి లభించింది. జిల్లాలో కూడా మంత్రులతో సంబంధంలేకుండా దువ్వాడ చెప్పిన పనులన్నీ అధికారులు చకచకా చేసిపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టెక్క లిలో వైకాపా సత్తా చాటింది.

 

ఆయ నకు మాత్రం ఎమ్మెల్సీ పదవి నజరానా కింద దక్కింది.  అయితే కొన్ని బల హీనతలు, స్థానికంగా ఉండే ఓ మహిళ ఇటీవల చేస్తున్న ప్రచారం దువ్వాడ కొంపముంచాయి. ఆ మహిళ చెప్పిన అధికారులకే పోస్టింగ్‌లలో  కూడా దువ్వాడ పెద్దపీట వేస్తారన్న ప్రచారం జరిగింది. ఆ మహిళ వ్యవహారంతో కుటుంబంలో వివాదాలు ప్రారంభమయ్యాయి. సీఎంఓ అదనపు కార్యదర్శి ధనంజయరెడ్డిని వాణి కలిసి దువ్వాడ పై ఫిర్యాదు చేశారన్న ప్రచారం జరి గింది. కొన్ని పత్రికల్లో దీనిపై కథనాలు కూడా వచ్చాయి. అయితే భారాభర్తలిద్దరూ ప్రెస్మీట్ పెట్టి వాటిని ఖండించారు. ఇటీవల దువ్వాడ వ్యవహారశైలితో వాణి విసిగిపోయినట్టు సమా చారం.

 

మరి కొన్ని ఆధారాలు కూడా ఆమె చేతికి చిక్కడంతో ఇవన్నీ సీఎం ముందు ఉంచారట. ప్రస్తుతం టెక్కలి వైకాపాలో అగమ్యగోచర పరిస్థితి, వర్గపోరు నెలకొంది. ఈ పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకోకుంటే మరోసారి అక్కడ పార్టీ ఓటమి తధ్యమని సీఎంకు అర్థమైంది. అందుకే వాణిని సమన్వయకర్తగా ప్రకటించి వచ్చే ఎన్నికల్లో ఆమెను బరిలో నిలపా లని నిర్ణయం తీసుకున్నారు. ఈ విష యాన్ని స్వయంగా దువ్వాడతోనే ప్రకటింపచేసి కుటుంబంలో విభేదాలున్నాయన్న ఆరోపణలకు చెక్ పెట్టాలని వైకాపా అధిష్టానం భావించింది. అందుకే శ్రీను శుక్రవారం టెక్కలి వైకాపా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వ హించి వచ్చే ఎన్నికల్లో వాణి పోటీ చేస్తారని

నరకాసురుడినైనా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మొద్దు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో జగన్ మోహన్.

ఆమెకు మద్దతివ్వాలని చెప్పుకొచ్చారుఎన్నికలకు ఏడాది సమయం ఉం డగానే ఇటీవల సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసిన సమ యంలో నిర్వహించిన బహిరంగసభలో దువ్వాడ శ్రీనివాస్ ను వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచి పార్టీ తరఫున పోటీలో నిలపనున్నట్లు జగన్ ప్రక టించారు. దువ్వాడే అభ్యర్థి అని, కేడర్ అంతా ఆయనకు సహకరించి గెలిపించాలని సూచిం చారు. ఇప్పుడు వాణీ అభ్యర్థిత్వాన్ని కూడా సీఎం అన్యమనస్కంగానే అంగీకరించినట్టు తెలుస్తోంది. దువ్వాడను తప్పించడం ఇష్టం లేక పోయినా పార్టీ, కుటుంబ పరిస్థితులను బేరీజు వేసుకొని అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారట.

 

దువ్వాడకు ప్రజల్లో కాస్త మంచిపేరే ఉన్నా ఫోన్ ఎత్తకపోవడం, కార్యకర్తలకు అందు బాటులో లేకపోవడం ఆయనకు మైనస్. ఇప్పుడు వాణీ హయాం ప్రారంభమైంది కాబట్టి ఆమె ఏవిధంగా ముందుకువెళ్లి టీడీపీని ఢీకొంటారన్నదే పెద్ద ప్రశ్న. బాహుబలి లాంటి అచ్చెన్నను టెక్కలిలో నిలువరించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. తనను పోటీ నుంచి తప్పించారన్న అక్కసు దువ్వాడకు లోలోపల ఉండవచ్చు. ఆయన ఏ మేరకు పనిచేస్తారన్నది కూడా ప్రశ్నార్థకమేనంటుఇదే సమయంలో.. వాణి కూడా కీలక ప్రకటన చేశారు. టెక్కలిలో ఎమ్మెల్యేగా శ్రీనివాస్ పోటీ చేస్తే.. తామంతా కష్టపడి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే.. దువ్వాడ దంపతులు సీఎం జగన్‌ను కలిశారు. ఈ భేటీ తర్వాత.. దువ్వాడ వాణి టెక్కలి బరిలోకి దిగబోతోందని శ్రీనివాస్ ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie