దేశముదురు చిత్రంలో అల్లుఅర్జున్ సరసన 2007 సంవత్సరం లో హన్సిక మోత్వాని ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ హన్సిక టాలీవుడ్ లో పలువురు యంగ్ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశం దక్కించుకుంది. ఒక వైపు తెలుగులో నటిస్తూనే మరో వైపు తమిళనాట తన సత్తా చాటింది. ఈ 32 ఏళ్ల ముద్దుగుమ్మ పుష్కర కాలంగా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటూనే ఉంది. ముఖ్యంగా తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ ఉంది.
అక్కడ ఏడాదికి నాలుగైదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రస్తుతం కూడా ఆమె చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు, కొన్ని కమర్షియల్ సినిమాలు ఉన్నాయి. ఇటీవలే ఈ అమ్మడు వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత సాధారణంగా సౌత్ హీరోయిన్స్ అందాల విందు విషయంలో కాస్త తగ్గుతారు. కానీ హన్సిక మాత్రం అప్పటికీ ఇప్పటికి ఏమాత్రం తేడా లేకుండా అందాల ఆరబోస్తూనే ఉంది. ఆకట్టుకునే ఈ అమ్మడి అందాల ఆరబోత సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ అవుతున్నాయి.