అధ్యక్షులు వనం సత్యనారాయణ
పద్మశాలి చేనేత కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఆగస్ట్ 7న నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రామకృష్ణాపూర్ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు వనం సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం క్యాతన్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ జంగం కళ, కమిషనర్ వెంకటనారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవాన్ని జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో అధికారికంగా నిర్వహించేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అడేపు తిరుపతి,స్టీరింగ్ కమిటీ సభ్యులు బూర సారంగపాణి, ఉపాధ్యక్షులు సమ్మయ్య,ఆర్గనైజింగ్ కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు.