గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామ శివారు పెట్రోలు బంకు దగ్గర జిబిసి రోడ్డుపై శనివారం తెల్లవారుజామున శ్రీకృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఎదురుగా వస్తున్న బైకిస్టును తప్పించబోయి బస్సు రోడ్డు మార్జిన్ లో ఉన్న డివైడర్ ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా యూటర్న్ తీసుకుంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. బస్సు ఒక్క కుదుపులో డివైడర్ ను ఢీకొని యూటర్న్ తీసుకోవడంతో ప్రయాణికులు ఒక్కసారి భయాందోళన చెంది కేకల వేశారు. క్షణాల్లో ఏం జరిగింది అని బస్సులో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. తెల్లవారుజాము కావడం వర్షం పడటంతో రోడ్డుపై రద్దీ లేకపోవడంతో పెను ఘోర ప్రమాదం తప్పింది.