పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాన్ని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన యాంటీ టెర్రరిస్ట్ గ్రూప్ పోలీసులు అక్కడి నుండి ప్రత్యేక వాహనం ద్వారా గోదావరిఖనికి వచ్చారు. గోదావరిఖని లోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారన్న సమాచారం అందుకున్న గుజరాత్ ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం మంగళవారం రాత్రి మహమ్మద్ జావిద్ (46) తో పాటు అతని కూతురు ఖతిజా (19) ను అదుపులోకి తీసుకున్నారు.
జావిద్ హైదరాబాద్ లోని అమీర్పేట్ లో ఓ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో సాఫ్ట్ వేర్ ట్రైనర్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది. తండ్రి కూతుర్లు టోలి చౌక్ లో నివాసం ఉంటున్నారు. బక్రీద్ పర్వదినం కోసం తండ్రి కూతుర్లు గోదావరిఖనికి వచ్చినట్టు సమాచారం. గతంలో జరిగిన పేలుళ్లతో సంబంధం ఉన్న జావేద్ ను అతని సన్నిహితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకునట్లు సమాచారం. వీరిని రామగుండం పోలీస్ కమిషనరేట్ కు పంపించి అక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్ళినట్లు తెలుస్తుంది.