హైదరాబాద్
మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అన్నారు. హైదరాబాద్ తార్నాకలో ఎన్ ఐ ఎన్ 50వ వార్షికోత్సవం జాతీయ ఐఎపిఎస్ఎమ్ గోల్డెన్ జూబ్లీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ గవర్నర్ హాజరయ్యారు. “వన్ ప్లాంట్, వన్ హెల్త్” అనే అంశంపై మూడు రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రైబల్ ఉమెన్స్ ఎక్కువగా ఐరన్ లోపంతో బాధపడుతున్నారని ఆడవారు ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవాలి. అవి పుట్టబోయే బిడ్డకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వెల్లడించారు. భారతదేశ సైంటిస్టులు కోవిడ్ కు వ్యాక్సిన్ తయారుచేసి ప్రపంచానికి అందించారని వారిని కొనియాడారు.కోవిడ్ సమయంలో వైద్య సేవలు అందించిన వైద్య ప్రతినిధులకు బహుమతులు అందజేశారు.