గోపవరం మండలం జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీనివాసపురం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. జోరు వాన కురుస్తుండటంతొ తల దాచుకునేందుకు ఆసరా కై గోడ వద్దకు వెళ్లిన వ్యక్తి అదే గోడ కూలి మీద పడడంతో పిల్లకాయల చిన్నసుబ్బయ్య(55)అనే వ్యక్తి మరణించిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది.మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని బేతాయపల్లె కు చెందిన పిల్లకాయల చిన్నసుబ్బయ్య అనే వ్యక్తి ఆదివారం తన స్వగ్రామమైన బేతాయపల్లెకు ద్విచక్ర వాహనంపై బద్వేలు నుంచి బయలు దేరడమైంది.
హాస్పిటల్ గేటు మూసివేసి వైసిపి కార్యకర్తలు ధర్నా.
మార్గ మధ్యలో శ్రీనివాసపురం సమీపానికి చేరుకునే టప్పటికి, వర్షం పడుతుండటంతో జాతీయరహదారికి పక్కనే వున్న రేకుల షెడ్ గోడ వద్ద తల దాచుకునేందుకు వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో విపరీతంగా గాలులు వీచడంతో గోడ విరిగి సుబ్బయ్య మీద పడటంతో అతను సంఘటనా స్థలిలోనే మరణించాడన్నారు.కాగా అదే సమయానికి గాలుల భీభత్సానికి సమీపంలోని విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డ క్రమంలో తెగిపడ్డ విద్యుత్ తీగల వల్ల విద్యుదా ఘాతానికి గురై సుబ్బయ్య మృతి చెంది వుండే అవకాశ ముందని స్థానికులు సందేహాలను వెలబుచ్చుతున్నారు. జరిగిన ఘటనపై బద్వేలు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.