Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

బ్యాంక్ ఖాతా జిరాక్స్ తీసిస్తానని.. బంగారు ఆభరణాలు చోరీ..!

Bank account xerox will be taken Gold ornaments stolen

0
  • ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో ఘటన
  • సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు గుర్తింపు: అరెస్ట్ చేసిన పోలీసులు

బ్యాంక్ ఖాతా జిరాక్స్ తీసిస్తానని మాయ మాటలు చెప్పి ఓ మహిళ మెడలో నుండి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..మెట్‌పల్లి మండలం కోనరావుపేట గ్రామానికి చెందిన సురకంటి స్వరూప అనే మహిళ ఈ నెల 3వ తేదీన పని నిమిత్తం మెట్ పల్లి కి వచ్చింది.తన వద్ద ఉన్న బ్యాంక్ ఖాతా జిరాక్స్ కోసం పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద అటు ఇటూ తిరుగుతూ ఉంది.

Gold ornaments stolen

ఇది గమనించిన మెట్ పల్లి కి చెందిన గొట్టెముక్కల సాయికుమార్ అనే యువకుడు స్వరూప దగ్గరకు వచ్చి జిరాక్స్ షాపు చూపిస్తానని బైక్ ఎక్కాలని చెప్పడంతో ఎక్కింది. దీంతో స్వరూపను తన బైక్ పై ఎక్కించుకున్న నిందితుడు ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలోని గండి హనుమాన్ దేవాలయం సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బండరాయితో కొట్టి చంపుతానని బెదిరించి స్వరూప మెడలోని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లి పారిపోయాడు.ఈ మేరకు బాధితురాలు ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.పలు ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించారు.

Gold ornaments stolen

సీసీ ఫుటేజీలో ఓ స్కూటీ పై వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు బైక్ నెంబర్ వివరాల ఆధారంగా కేసును ఛేదించారు.నిందితుడు రాజేశ్వర్ రావు పేట శివారు లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డాడని.. నిందితుడు ఉపయోగించిన స్కూటీ ఓ కన్సల్టెంట్ లో కిరాయికి తీసుకున్నట్లు గుర్తించారు.నిందితుడి వద్ద నుండి మూడు తులాల పుస్తెల తాడు, చెవి కమ్మలు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.కేసును త్వరగా ఛేదించిన సీఐ లక్ష్మీనారాయణ,ఎస్ఐ ఉమాసాగర్, కానిస్టేబుల్ కిరణ్, సంతోష్, అనిల్ లను జిల్లా ఎస్పీ భాస్కర్ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie