Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఇంటర్నల్ రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వండి –  డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి.

0

తిరుపతి నగరంలోని ఇంటర్నల్ రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి. తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ లోని యుడిసి, ఓల్డ్ తిరుచానూరు రోడ్డు లో బిటి రోడ్డు, ఎస్ జి ఎస్ కాలేజీ ఇంటర్నల్ రోడ్డు పనులను డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కె.బాబుతో కలిసి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పరిశీలించారు. ఈ సంధర్భంగా భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ రోడ్లకు ఎటువంటి ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేశామో

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారణ.. త‌దుప‌రి విచార‌ణ 19కి వాయిదా.. తన కేసును తానే వాదించుకున్న సునీత..

అదేవిధంగా ఇంటర్నల్ రోడ్లకు అంతే ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేస్తున్నామన్నారు. రోడ్లను నాణ్యత ఉండేవిధంగా వేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం తిరుపతి నగరాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కోటూరు అంజినేయులు, టౌన్ బ్యాంకు డైరెక్టర్ అమర్ నాథ్ రెడ్డి, అంకాలమ్మ గుడి చైర్మన్ లక్ష్మయ్య, ఎస్.కె. జానీ, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie