భద్రాద్రి కొత్తగూడెం: దమ్మపేట మండలం అంకంపాలెం ఆశ్రమ పాఠశాల పదో తరగతి విద్యార్థిని అదృశ్యం అయిన ఘటన కలకలం రేపింది. అయితే విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈనెల 24న ఇంటి నుండి హాస్టల్ కి వచ్చిన విద్యార్థిని అదేరోజు అదృశ్యం అయింది.
ఈనెల 24న మధ్యాహ్నం 2 గంటలకు హాస్టల్ కు వచ్చిన విద్యార్థిని అదేరోజు రాత్రి 10గంటల సమయంలో గోడ దూకి పరార్ అయినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్టు సమాచారం. తమ కూతురు కనిపించటం లేదంటూ దమ్మపేట పోలీస్ స్టేషన్లో తలిదండ్రులు పిర్యాదు చేసారు.