సూర్యాపేట జిల్లా పరిధిలోని గరిడేపల్లి శివారలో ఉన్న పంట పొలాలలో ఉన్న చెత్త చేదారానికి నిప్పు పెట్టడంతో.. గాలి దుమారానికి ఆ మరింత స్పీడ్ గా మంటలు అంటుకున్నాయి. దీంతో.. సమీపంలోని వైన్ షాప్ వరకు మంటలు అంటుకొని.. సిట్టింగ్ కోసం వేసిన గుడిసే కు సైతం ఆ మంటలు వ్యాపించి దగ్ధం అయ్యింది. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్దం గాక.. ఫుల్లుగా తాగిన మందుబాబులకు.. ఆ కిక్కు దిగేలా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో.. అక్కడ ఉన్న వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో.. అక్కడున్న వంట సామాగ్రి అంతా పూర్తిగా కాలి బూడిద అయ్యింది. అంతేకాదు మద్యం దుకాణంలో నిండుగా ఉన్న సరుకంతా.. దాదాపు 40 లక్షల రూపాయల విలువైన మద్యం అంతా మంటల్లో కాలి బూడిదైంది.