జగిత్యాల అర్బన్ సూపర్వైజర్ రాణి
జగిత్యాల:మూడు నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలలో ఆట,పాటల ద్వారా విద్యను అందిస్తామని ఐసిడిఎస్ అర్బన్ సూపర్వైజర్ రాణి అన్నారు.గురువారం జగిత్యాల పట్టణంలోని 3 వ వార్డు చిలుకవాడ అంగన్వాడి కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్య వార్షికోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వ ప్రాథమిక విద్య ప్రాముఖ్యతపై ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎల్. రాణి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో అందించడం జరుగుతుందని వివరించారు.
ఆట,పాటల విద్య ద్వారా పిల్లల్లో శారీరక, మానసిక, నైపుణ్యాభివృద్ధి జరుగుతుందని వివరించారు.ఈ సందర్భంగా అంగన్వాడి పిల్లలకు అసెస్మెంట్ కార్డులు అందించారు. అదేవిధంగా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలతో మంచి అలవాట్లు,ఆటలు,పాటలు కథలు,సృజనాత్మక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగనవాడి టీచర్లు వి. పవిత్ర,వి.జ్యోతి,పి. సౌజన్య ఆయాలు, తల్లులు పాల్గొన్నారు.