Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తెలంగాణలో గద్దర్  కొత్త పార్టీ..

0

ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారా?.. పార్టీ ఏర్పాటుకు సంబంధించి.. ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారా?.. ఇవాళ ఎన్నికల కమిషన్‌తో గద్దర్ భేటీ కానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోవాలని ప్రజాయుద్ధనౌక గద్దర్ డిసైడ్‌ అయ్యారు. ఆ పార్టీ.. ఈ పార్టీలో చేరడం కాకుండా.. సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం ఢిల్లీ వెళ్లారు గద్దర్. దానిలో భాగంగా ఇవాళ ఎన్నికల కమిషన్‌తో భేటీ కానున్నారు గద్దర్‌. గద్దర్ ప్రజా పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

పాటతోనే ప్రస్థానాన్ని ప్రారంభించి.. పాటతోనే ప్రజా ప్రస్థానాన్ని ముగిస్తానని చెప్పిన గద్దర్.. ఇప్పుడు కొత్త పార్టీకి అంకురార్పణ చేయటం ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే కొత్త పార్టీకి సంబంధించిన విధివిధాలను ఆయన రూపొందించినట్లు టాక్‌ వినిపిస్తోంది. నిజానికి.. గద్దర్ విప్లవానికి, పోరాటానికి ప్రతీక. అందుకే.. గద్దర్ తన కొత్త పార్టీ జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే.. జెండా మధ్యలో పిడికిలిని పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. జెండాలో ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగులు ఉండబోతున్నాయి. ఇదిలావుంటే.. గద్దర్ తన ప్రయాణాన్ని ఎరుపురంగుతోనే ప్రారంభించారు. గద్దర్ మొదట అంబేద్కరిస్టు.. కాలానుగుణంగా వామపక్ష రాజకీయాలపై ఆకర్షితులయ్యారు.

 

అందుకే… జెండాలో నీలి రంగు తప్పకుండా ఉంటుందని భావిస్తున్నారు.ఇక.. కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో గద్దర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆ మధ్య వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం కూడా జరిగింది. స్వరాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బట్టబయలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గద్దర్.. సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఆయన కాంగ్రెస్‌ చేరి ఆ పార్టీ నుంచే పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇదిగో ఇప్పుడు కొత్త పార్టీ పెట్టబోతున్నారు. గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఉద్యమానికి ఆకర్షితులై ఆయన పాటలతో ప్రజల్లోకి వెళ్లారు.

పవన్ యాత్రతో.. లోకేష్ యాత్రపై ప్రభావం..

బహుజనులను జాగృతం చేసేందుకు ప్రయత్నించారు.  పాటలతో  ఉద్యమాన్ని రగిలించారు.  పాటతోనే ప్రస్థానాన్ని ప్రారంభించి.. పాటతోనే ప్రజా ప్రస్థానాన్ని ముగిస్తానని చెప్పిన గద్దర్ ఓట్ల రాజకీయాలపై రావాలని నిర్ణయించుకున్నారు. గద్దర్ చాలా కాలంగా  రాజకీయ పార్టీలతో కలుస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనతో సమావేశం అయ్యారు. మునుగోడు ఎన్నికలకు ముందు కేఏ పాల్ ను కూడా కలిశారు. ఆయన సమక్షంలోనే .. తన ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ ను అభ్యర్థిగా ప్రకటించారు పాల్. తర్వాత గద్దర్ సైలెంట్ అయ్యారు. ఇటీవల కేసీఆర్‌ పై పోటీ చేస్తానని ప్రకటిస్తారు. ఈ క్రమంలో సొంత పార్టీ పెట్టడంతో ఆ ప్రభావం ఎంత ఉంటుందన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie