ఇటీవల గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న యుద్ద నౌక గద్దర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. 1949లో తూప్రాన్‌లో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. బలమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నప్పటికీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించే దేశంలో పలు కమ్యూనిస్ట్ పార్టీలతో తన భావాలను పంచుకోలేదు. ఎన్నో పాటలతో ఉద్యమానికి ఊపిరి పోశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఊరూరా తిరిగి ప్రచారం చేశారు.